Avatar 2: డిజిటల్ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. సినిమాను చూడాలంటే మాత్రం..

ABN , First Publish Date - 2023-03-26T18:44:46+05:30 IST

‘టైటానిక్’ (Titanic) డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar2). ఈ మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 160భాషల్లో విడుదల అయింది.

Avatar 2: డిజిటల్ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. సినిమాను చూడాలంటే మాత్రం..

‘టైటానిక్’ (Titanic) డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar2). ఈ మూవీ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 160భాషల్లో విడుదల అయింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 2.3 బిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది. కానీ, సినిమాను చూడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.

‘అవతార్ 2’ మార్చి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదికలైన యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, గూగుల్‌ ప్లే, ఎక్స్‌ఫినిటీ, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీస్‌లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాను చూడాలనుకున్న వారు 19.99 అమెరికన్‌ డాలర్స్ చెల్లించి ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చు. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.1,630 చెల్లించాలి. మార్చి 28వ తేదీ ఉదయం 9.30గంటల నుంచి ‘అవతార్ 2’ ను వీక్షించవచ్చు. ఒకసారి మూవీని ప్రీ ఆర్డర్‌ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. ‘అవతార్‌ 2’ 4కె అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ అట్మాస్ ఫార్మాట్స్‌లో అందుబాటులో ఉండనుందని చిత్ర బృందం తెలిపింది.

‘అవతార్’ 2009లో విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 2.97బిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. మూవీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ‘అవతార్’ కు సీక్వెల్ గా ‘అవతార్ 2’ లో తెరకెక్కింది. సెకండ్ పార్ట్‌లో శామ్ వర్తింగ్‌టన్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్‌స్లేట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-26T18:44:47+05:30 IST