Param Sundari controversy: మలయాళ అమ్మాయిలు దొరకలేదా.. వివాదంపై సింగర్‌ పవిత్ర క్లారిటీ..

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:44 PM

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘పరమ్‌ సుందరి’. ఇందులో హీరోయిన్‌గా జాన్వీని తీసుకోవడంపై పలు విమర్శలు ఎదురయ్యాయి.

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘పరమ్‌ సుందరి’ (Param Sundari). ఇందులో హీరోయిన్‌గా జాన్వీని తీసుకోవడంపై పలు విమర్శలు ఎదురయ్యాయి. ఉత్తరాదికి చెందిన అమ్మాయిని మలయాళ అమ్మాయిగా చూపించడంతో మలయాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు అసంతృ్లిలత వ్యక్తం చేశారు. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రంలో యాక్ట్‌ చేయడానికి మలయాళ హీరోయిన్స్‌ దొరకలేదా? అంటూ గాయని పవిత్రా మీనన్‌ ( Pavithra Meenan) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశారు. అది వైరల్‌ కావడంతో చర్చనీయాంశమైంది. కేరళ యువతి, ఢిల్లీ యువకుడి ప్రేమకథే ఈ సినిమా. సిద్థార్థ్‌ మల్హోత్రా కథానాయకుడు. సుందరి దామోదరం పిళ్లైగా జాన్వీ, పరమ్‌ సచ్‌దేవ్‌గా సిద్థార్థ్‌ నటించారు. తుాషార్‌ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకువచ్చింది. పవిత్రా మీనన్‌ పోస్ట్‌పై ఆమె క్లారిటీ ఇచ్చారు. (Janhvi Kapoor Vs Pavithra Meenan)

‘నేను యాక్టర్‌ను కాదు. సింగర్‌ను. జాన్వీ కపూర్‌కి వ్యతిరేకంగా ఒక మలయాళ నటి విమర్శలు చేసింది అనే వార్తల్లో నిజం లేదు. నేను మాట్లాడింది పూర్తిగా భిన్నమైన అంశం. ఇది వృత్తిపరమైన అసూయ కాదు. నిజాయితీగా చెప్పాలంటే నేను వేరొకరి నోటి దగ్గర అన్నం లాగేసుకొనే ప్రయత్నం చేయలేదు. నేను భాష గురించి మాత్రమే మాట్లాడాను. మరొక ప్రాంతానికి చెందిన వారు మలయాళం సరిగ్గా మాట్లాడలేరని చెప్పానంతే. జాన్వీ ఆ పాత్రకు న్యాయం చేసింది. నేను ఆమెను రెండుసార్లు కలిశాను. వ్యక్తిగతంగానూ తెలుసు. సినీ ఇండస్ర్టీలో ఏ ప్రాంతం నుంచైనా నటీనటులను ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఇతర ప్రాంతాల ఆర్టిస్ట్‌లను సెలెక్ట్‌ చేసుకున్నప్పుడు వారికి మన భాషను నేర్పించడానికి కోచ్‌ను నియమించుకోవాలి. అలా నియమించడం మంచిదే కానీ దాని వల్ల ఎలాంటి నష్టం లేదు’ అని అన్నారు. (Bollywood vs Malayalam industry)

ఇదే విషయంపై జాన్వీ కపూర్‌ గతంలో ఓ సందర్భంలో స్పందించారు. ‘నేను మలయాళ అమ్మాయిని కాదు. మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు. కానీ, కేరళ సంస్కృతిపై నేనెప్పుడూ ఆసక్తి చూపిస్తా. ముఖ్యంగా మలయాళ సినిమాలకు నేను అభిమానిని. ‘పరమ్‌ సుందరి’లో నేను మలయాళ అమ్మాయిగానే కాదు తమిళ అమ్మాయిగానూ కనిపిస్తా’ అని అన్నారు.

ALSO READ: Lokesh Kanagaraj: అనిరుధ్‌ సంగీతంపై అంత నమ్మకం ఏంటో.. 

Nagarjuna Defamation Case: అవమానానికి గురయ్యాం.. పరువు నష్టం దావా కేసులో నాగార్జున తుది వాంగ్మూలం

Jayanthi Janaki Vanisree: ఆ ముగ్గురు... నటీమణులు...


Updated Date - Sep 04 , 2025 | 01:54 PM