Avatar 2: టామ్ క్రూజ్ సినిమా రికార్డును చెరిపేసిన అవతార్.. ఈ ఏడాది..

ABN , First Publish Date - 2023-01-04T20:47:43+05:30 IST

టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించిన సినిమా ‘అవతార్ 2’ (Avatar 2). ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009లో విడుదలైన ‘అవతార్’ (Avatar) కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది.

Avatar 2: టామ్ క్రూజ్ సినిమా రికార్డును చెరిపేసిన అవతార్.. ఈ ఏడాది..

టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించిన సినిమా ‘అవతార్ 2’ (Avatar 2). ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009లో విడుదలైన ‘అవతార్’ (Avatar) కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదల అయింది. అందుబాటులో ఉన్న అన్ని పార్మాట్స్‌లో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అవతార్ 2’ విజువల్ వండర్‌గా రూపొందింది. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డును నెలకొల్పింది. 2022లో అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన మూవీగా చరిత్రను తిరగరాసింది.

టామ్ క్రూజ్ నటించిన సినిమా వసూళ్లను ‘అవతార్2’ అధిగమించింది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇప్పటి వరకు టామ్ క్రూజ్ ‘టాప్ గన్: ది మావెరిక్’ ఉండేది. ‘టాప్ గన్’ మూవీ 2022లో 1.49బిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ విడుదల అయిన 20రోజుల్లోనే ఈ సినిమా రికార్డు చెరిపేసింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీగా రికార్డు సృష్టించింది. 1.5బిలియన్ డాలర్స్ కంటే కొంచెం తక్కువగా వసూళ్లను రాబట్టింది. ‘అవతార్2’ త్వరలోనే ‘జురాసిక్ వరల్డ్ డామినియన్’ వసూళ్లను అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. అయితే, 2 బిలియన్ డాలర్స్‌ క్లబ్‌లోకి ఈ మూవీ చేరుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 2బిలియన్ డాలర్స్ క్లబ్‌ను జేమ్స్ కామెరూనే టైటానిక్ సినిమాతో ఆరంభించాడు. ‘అవతార్’ కూడా 2.97బిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది. ఈ క్లబ్‌లో మరో మూడు చిత్రాలు ‘స్టార్ వార్స్: ఫోర్స్ అవెకిన్స్’, ‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ ఉన్నాయి.

Updated Date - 2023-01-04T20:50:36+05:30 IST