Tollywood: అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్ర
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:56 PM
ప్రముఖ హాస్యనటుడు రామచంద్ర ఇటీవల పక్షవాతానికి గురయ్యారు. ఆయన్ని కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ పరామర్శించగా, తాజాగా కాదంబరి కిరణ్ తమ 'మనం సైతం' సంస్థ ద్వారా ఆర్థికసాయం అందించారు.
తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలలో నటించాడు రామచంద్ర (Ramachandra). రవితేజ (Raviteja) హీరోగా నటించిన 'వెంకీ' (Venky) సినిమా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇటీవల పక్షవాతానికి గురైన రామచంద్ర నటనకు దూరమయ్యారు. కొద్ది రోజుల క్రితమే మంచు మనోజ్ (Manchu Manoj) ... రామచంద్రను ఇంటికి వెళ్ళి కలిసి, అతని ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అలానే తాజాగా నటుడు కాదంబరి కిరణ్ (Kadambari Kiran)... రామచంద్రను ఇంటి కెళ్ళి పరామర్శించారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల కోసం 'మనం సైతం' (Manam Saitam) సంస్థ తరఫున రామచంద్ర కు రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించారు. కాదంబరి కిరణ్ రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, 'దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు 'మనం సైతం' ద్వారా సాయం అందిస్తున్నామని, సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుంద'ని తెలిపారు. 'అవసరమైన వారికి ‘మనం సైతం’ సంస్థ ద్వారా అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన చెప్పారు.
Also Read: Jayanthi Janaki Vanisree: ఆ ముగ్గురు... నటీమణులు...
Also Read: Param Sundari controversy: మలయాళ అమ్మాయిలు దొరకలేదా.. వివాదంపై సింగర్ పవిత్ర క్లారిటీ..