Kamal Haasan: నిన్న ఉదయనిధి.. నేడు కమల్..వీరికి తగిన గుణపాఠం చెప్పాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 10:35 PM
లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan).. వివాదాలను కావాలని తెచ్చుకుంటున్నాడో.. లేక ఆయన మాటల వలన వివాదాలు అవుతున్నాయో తెలియడం లేదు.
Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan).. వివాదాలను కావాలని తెచ్చుకుంటున్నాడో.. లేక ఆయన మాటల వలన వివాదాలు అవుతున్నాయో తెలియడం లేదు. మొన్నటికి మొన్న ఒక సినిమా ఈవెంట్ లో కన్నడ తమిళ్ నుంచి పుట్టింది అని పెద్ద వివాదాన్ని తీసుకొచ్చాడు. అది చినికి చినికి గాలివానలా మారి థగ్ లైఫ్ సినిమాను మొత్తం కాల్చేసింది. సినిమా పోయినా కూడా కమల్ లో ఎలాంటి మార్పు రాలేదు. కోర్టులు, కేసులు అని తిరిగినా కూడా మళ్లీ ఈసారి ఇంకో వివాదంలో ఇరుక్కున్నాడు. బీజేపీ నాయకులు కమల్ పై మండిపడుతున్నారు. అంతలా కమల్ ఏం చేశాడు అనేది తెలుసుకుందాం రండి.
హీరో సూర్య స్థాపించిన అగారం ఫౌండేషన్ ఈవెంట్ కు కమల్ హాసన్ ముఖ్య అతిధిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. విద్య లేనిదే ఏది లేదు అనే విషయాన్నీ చెప్పడానికి కమల్.. నియంతృత్వాన్ని, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్య అని చెప్పుకొచ్చాడు. అదుగో ఆ ఒక్క మాట రాష్ట్రాలను తగలబెట్టేస్తుంది. హిందూ ధర్మం గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని హిందువులు మండిపడడం మొదలుపెట్టారు. ఎవరు పడితే వాళ్లు సనాతన ధర్మం గురించి హేళన చేసి మాట్లాడమే పని అని, కమల్ కూడా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నాడని ఫైర్ అయ్యారు.
హిందువులు మాత్రమే కాదు బీజేపీ నేతలు కూడా కమల్ పై కన్నెర్ర చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ సినిమాలను ఇకనుంచి బ్యాన్ చేయాలనీ బీజేపీ పిలుపునిచ్చింది. తమిళనాడు బీజేపీ పార్టీ సెక్రటరీ అమర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ' అప్పుడు ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు కమల్ హాసన్.. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీరికి తగిన గుణపాఠం చెప్పాలి. హిందువులు ఎవ్వరూ కమల్ హాసన్ సినిమాలు చూడకూడదు. చివరకి ఓటీటీలో కూడా ఆయన సినిమాలు బ్యాన్ చేయాలి. ఇలా చేస్తేనే ఇంకెవ్వరూ సనాతన ధర్మం గురించి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకుండా ఉంటారు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వివాదంపై కమల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Ramayana: కృత్రిమ మేధతో అలరించేలా 'రామాయణ'
Actor Praveen: నేను హీరోలా ఫీల్ అవ్వడం లేదు..