The Rajasaab: ప్రభాస్ రాజాసాబ్.. నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు..
ABN , Publish Date - Aug 07 , 2025 | 10:38 AM
కొంతకాలంగా టాలీవుడ్‌లో రెండు పార్టుల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలు నటించే చిత్రాల్లో కొన్ని రెండు పార్టులుగా విడుదల చేయడం మొదలెట్టారు.
కొంతకాలంగా టాలీవుడ్‌లో రెండు పార్టుల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలు నటించే చిత్రాల్లో కొన్ని రెండు పార్టులుగా విడుదల చేయడం మొదలెట్టారు. దానికి కారణం కథలో ఉన్న బలం కావచ్చు.. సినిమా నిడివి పెద్దదిగా ఉండడం కావచ్చు. గడిచిన పదేళ్లలతో తీసుకుంటే బాహుబలితో ఈ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు ప్రభాస్ నటించే ఏ సినిమా అయినా పాన్ ఇండియా స్థాయిలో విడుదల పక్కా. అది కూడా రెండుపార్టులుగా తీయడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం అలాంటి చిత్రాలు రెండు సెట్స్ మీదున్నాయి. అవి ‘కల్కి 2’, ‘సలార్ 2’. వీటిని పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం మారుతి (maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’కి (The Raja saab) రెండు పార్టులుగా రానున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. టీజర్ రిలీజ్ సమయంలో దర్శకుడు మారుతి కూడా ఇచ్చీ ఇవ్వనట్లు హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు. ‘రాజాసాబ్ 2’ ఉంటుందని చెప్పారు. కానీ తొలి భాగానికి కొనసాగింపులా కాకుండా థీమ్, సెటప్ ఒకే తరహాలో ఉంటాయయన్నారు.
ALSO READ: Tamannaah Bhatia: పెద్ద హీరో అరుపులు.. తమన్నా ఏడుపు.. క్షమాపణలు
అనంతరం సినిమా విడుదల తేదీపై స్పందించారు. ‘ప్రభాస్ అభిమానులు, తెలుగు పంపిణీదారులు సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయాలని కోరుతున్నారు. హిందీ ప్రేక్షకులు మాత్రం డిసెంబర్ 5న విడుదల చేయాలంటున్నారు. అయితే మేం ఏ తేది అనుకున్నామో అదే తేదికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తాం. అక్టోబర్‌కి సినిమా మొత్తం పూర్తి కానుంది’ అని విశ్వప్రసాద్ తెలిపారు. ఇందులో నిధీ అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిసున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ALSO READ: Ramayana: కృత్రిమ మేధతో అలరించేలా 'రామాయణ'
Thursday Tv Movies: గురువారం, ఆగస్టు 7న.. టీవీల్లో వచ్చే తెలుగు సినిమాలు
Mayasabha Review: దేవ కట్టా.. మయసభ వెబ్ సీరిస్ రివ్యూ
Kamal Haasan: నిన్న ఉదయనిధి.. నేడు కమల్..వీరికి తగిన గుణపాఠం చెప్పాలి