Tamannaah Bhatia: పెద్ద హీరో అరుపులు.. తమన్నా ఏడుపు.. క్షమాపణలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 09:59 AM

తమన్నా తాజాగా బాలీవుడ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.

Tamannaah Bhatia

అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah Bhatia) . దక్షిణాదిలో అగ్ర హీరోలందరి సరసనచచ ఆమె అవకాశాలందుకున్నారు. నటిగా మంచి గుర్తింపు పొంది టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లతోనూ అలరిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని ఆ విషయాన్నే మేకర్స్‌కు చెప్పగా ఆమె స్థానంలో మరో నటిని తీసుకొచ్చి పెట్టారని తమన్నా చెప్పారు.

ALSO READ: Srivalli - Yesubai: రశ్మికపై ఆ రెండు పాత్రల ప్రభావం

‘నేను టీనేజ్‌లోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పట్లో నాకేం తెలియదనుకునేవారు. నా నమ్మకాన్ని దెబ్బ తీయాలని చాలామంది ప్లాన్‌ చేశారు. ఇలా ఎన్నో సందర్భాల్లో జరిగింది. చాలా అవమానాలు ఎదుర్కొన్నా. పరిశ్రమకు వచ్చిన కొద్దికాలంలోనే సౌత్‌లో ఓ పెద్ద స్టార్‌తో నటించే అవకాశం వచ్చింది. అతనితో కొన్ని సీన్స్‌ చేస్తునప్పుడు అసౌకర్యంగా, కష్టంగా అనిపించింది. ఇబ్బందిగా ఉంది నేను చేయలేనని దర్శకనిర్మాతలకు చెప్పాను. అప్పుడా స్టార్‌ హీరో ‘హీరోయిన్‌ను మార్చేయండి’ అని నాపై గట్టిగా అరిచాడు. ఆ అవమానాన్ని భరించిన ఏదో పెద్దాయన కదా అని సైలెంట్‌గా ఉన్నా. ఆయన మాత్రం షూటింగ్‌ మధ్యలో యూనిట్‌ అందరిలో పెద్దగా కేకలు వేశాడు. మరుసటిరోజు ఆయనే నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. కోపం రావడంతో అరిచానని చెప్పాడు. నాతో అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు’ అని తమన్నా తెలిపారు. అయితే ఆ బిగ్‌స్టార్‌ ఎవరనేది మిల్కీబ్యూటీ గోప్యంగా ఉంచింది. ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు తమన్నా. శేఖర్‌ కమ్ముల ‘హ్యాపీడేస్‌’ సూపర్‌హిట్‌ కావడంతో అవకాశాలు వరుస కట్టాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ ఎదిగింది. తాజాగా ‘రైడ్‌ 2’తో ఓ ప్రత్యేక సాంగ్‌తో అలరించింది. ఇప్పుడు హిందీలో ఆమె నటిస్తున్న నాలుగు చిత్రాలు సెట్స్‌పై ఉనాయి. ఓదెల 2 తర్వాత మరో తెలుగు సినిమా అంగీకరించలేదు తమన్నా.

ALSO READ: Ramayana: కృత్రిమ మేధతో అలరించేలా 'రామాయణ'

Thursday Tv Movies: గురువారం, ఆగ‌స్టు 7న‌.. టీవీల్లో వ‌చ్చే తెలుగు సినిమాలు

Mayasabha Review: దేవ కట్టా.. మయసభ వెబ్ సీరిస్ రివ్యూ

Kamal Haasan: నిన్న ఉదయనిధి.. నేడు కమల్..వీరికి తగిన గుణపాఠం చెప్పాలి

Updated Date - Aug 07 , 2025 | 10:46 AM