Vivek Agnihotri: నేను అక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తా.. నన్నెవరు ఆపుతారో చూస్తా
ABN , Publish Date - Aug 06 , 2025 | 08:20 PM
వివాదాలను కొనితెచ్చుకొనే డైరెక్టర్స్ లో బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri) ఒకరు. ఆయన తీసిన సినిమాలు వివాదాలు అవుతాయా.. ? లేక వివాదాలు కావాలనే సినిమాలు తీస్తాడా.. ? అనేది మాత్రం తెలియదు.
Vivek Agnihotri: వివాదాలను కొనితెచ్చుకొనే డైరెక్టర్స్ లో బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri) ఒకరు. ఆయన తీసిన సినిమాలు వివాదాలు అవుతాయా.. ? లేక వివాదాలు కావాలనే సినిమాలు తీస్తాడా.. ? అనేది మాత్రం తెలియదు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఇండస్ట్రీని ఏ రేంజ్ లో హీట్ ఎక్కించిందో అందరికీ తెల్సిందే. ఆ సెగ ఇంకా తగ్గకముందే ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files) ను తెరకెక్కించి రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. మొదట దీనికి ది ఢిల్లీ ఫైల్స్..ది బెంగాల్ చాప్టర్ అని టైటిల్ పెట్టారు. ఆ తరువాత ది బెంగాల్ ఫైల్స్ గా మార్చారు.
ది బెంగాల్ ఫైల్స్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెల్సిందే. 1946లో త్రిపుర జిల్లాలో జరిగిన దాడులు, దేవాలయాల ధ్వంసం, విగ్రహాల విధ్వంసం, మరియు హిందూ ఉనికిని తొలగించడానికి జరిగిన దోపిడీలను ఇందులో చూపించడంతో ఎంతోమంది రాజకీయ నాయకులు ది బెంగాల్ ఫైల్స్ పై కేసులు కూడా పెట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులు వివేక్ అగ్నిహోత్రి మరియు నిర్మాత పల్లవి జోషిపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. ఈ సినిమాను విడుదల చేయమని డిమాండ్ చేశారు.
ఇక తాజాగా ఈ కేసులపై వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. నిజాన్ని ఎవరూ ఆపలేరని, కచ్చితంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తానని ఆయన సవాల్ చేశాడు. ' పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేతలు నాపై ఎన్నో కేసులు పెట్టారు. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో చీకటి నిజాలు ఉన్నాయి. వాటిని ఆపడానికి ఈ ఎత్తులు వేస్తున్నారు. ఇదే వారి వారి వ్యూహం. కానీ, మేము చట్టాన్ని గౌరవించి సైలెంట్ గా ఉన్నాం. నాకు భారతీయ న్యాయవ్యవస్థలపై, ముఖ్యంగా కలకత్తా హైకోర్టుపై గొప్ప నమ్మకం ఉంది.
వాళ్లు మాపై ఎన్నో ఒత్తుళ్ళను తీసుకొచ్చారు. అయినా మేము బెదరలేదు. ఈ సినిమా మీ సినిమా.. మీ అందరి సినిమా. మీరే మాకు ఇప్పుడు సపోర్ట్ గా ఉండాలి. వారందరికీ నేను సవాల్ చేస్తున్నాను. పశ్చిమ బెంగాల్ లో ఎవరైతే నా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయొద్దని చెప్పారో.. అక్కడే నా ట్రైలర్ రిలీజ్ చేస్తా. నన్ను ఎవరు ఆపుతారో చూస్తా. నేను నిజాన్ని చూపిస్తున్నాను. నా సత్యాన్ని ఎవరూ దాచలేరు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి ఎన్ని వివాదాలు సృష్టిస్తాడో చూడాలి.
Bun Butter Jam Movie: తెలుగులోనూ వస్తున్న 'బన్ బటర్ జామ్’
Mayasabha The Rise of the Titans: మయసభ వెబ్ సీరిస్ రివ్యూ