Vaa Vaathiyaar: ఎంజీఆర్ ను అనుకరించబోతున్న కార్తీ...
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:36 AM
కార్తీ సినిమాల విడుదలలో జాప్యం జరుగుతున్నా... అతను మాత్రం షూటింగ్స్ తో బిజీగానే ఉన్నాడు. ఈ యేడాది డిసెంబర్ లో అతని తాజా చిత్రం 'వా వాతియార్' విడుదల కాబోతోంది.
తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) సినిమా విడుదలలో జాప్యం జరుగుతోంది కానీ ఆయన మాత్రం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 'సత్యం సుందరం' (Satyam Sundaram) సినిమాతో తెలుగువారి ముందుకు వచ్చిన కార్తీ ఆ తర్వాత 'కంగువ' (Kanguva), 'హిట్ -3' (Hit -3)లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. అయితే కార్తీ హీరోగా నటించిన 'వా వాతియార్' (Vaa Vaathiyaar) మూవీని ఈ యేడాది డిసెంబర్ లో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.
కార్తీ, కృతిశెట్టి జంటగా ఈ సినిమాను కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. దీనికి నలన్ కుమారస్వామి దర్శకుడు. రాజ్ కిరణ్, సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర బృందం చెబుతున్నదానిని బట్టి ఇది 1990కు సంబంధించిన చిత్రమని తెలుస్తోంది. ఎంజీఆర్ కు వీరాభిమాని అయిన ఓ వ్యక్తి తన మనవడిని కూడా ఆయన తరహాలోనే పెంచి పెద్ద చేస్తాడట. ఆ పాత్రను ఇందులో కార్తీ చేస్తున్నాడని అంటున్నారు. అంటే ఈతరం సినిమా జనాలు కార్తీలో అలానటి ఎంజీఆర్ ను చూడబోతున్నారన్న మాట. మరి ఈ సినిమా తెలుగులో వస్తే ఎలా ఆదరిస్తారో తెలియదు కానీ తమిళనాట మాత్రం మాస్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో దీనిని ఓన్ చేసుకుంటారని అనుకోవచ్చు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న 'వా వాతియర్' డిసెంబర్ లో రాబోతోందని తెలియచేస్తూ వేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
ఇదిలా ఉంటే కార్తీ నటిస్తున్న 'సర్దార్ -2', 'మార్షల్' సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలానే 'ఖైదీ -2'తో పాటుగా 'హిట్ 4' మూవీ కూడా కార్తీ చేయాల్సి ఉంది. మరి ఇందులో ఏ యే సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
Also Read: HBD Pawan Kalyan: అభిమానుల దాహం తీర్చుతున్న ఓజీ
Also Read: HBD Powerstar Pawan Kalyan: సెప్టెంబర్ సెంటిమెంట్...