The Bengal Files Trailer: ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ చూశారా ..

ABN , Publish Date - Aug 16 , 2025 | 02:32 PM

ది కాశ్మీర్ ఫైల్స్ తో దేశం మొత్తం హీటెక్కించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri).. మరోసారి దేశాన్ని హీట్ ఎక్కించడానికి సిద్దమయ్యాడు.

The Bengal Files

The Bengal Files Trailer: ది కాశ్మీర్ ఫైల్స్ తో దేశం మొత్తం హీటెక్కించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri).. మరోసారి దేశాన్ని హీట్ ఎక్కించడానికి సిద్దమయ్యాడు. ఈసారి ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files) తో మరో కొత్త వివాదానికి నాంది పలికాడు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ది బెంగాల్ ఫైల్స్ రిలిజ్ కాకముందే ఎన్నో వివాదాలను రేకెత్తించింది.


ది బెంగాల్ ఫైల్స్ సినిమాను రిలీజ్ ఆపాలని రాజకీయ నేతలు డిమాండ్ కూడా చేశారు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా వివేక్ అగ్నిహోత్రి ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బెంగాల్ లో ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు.. అనేది ఈ ట్రైలర్ వివేక్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ట్రైలర్ లో హిందూ - ముస్లింల మధ్య వివాదాలు, హిందువులు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు ఇలాంటివన్నీ ఇందులో చూపించారు. ఈ ట్రైలర్ పై కచ్చితంగా రాజకీయ నాయకులు ఫైర్ అవ్వడం, సినిమాను రిలీజ్ చేయకుండా ఆపడం, విమర్శలు వస్తాయి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 02:32 PM