Pawan Mashup: మనల్ని ఎవడ్రా ఆపేది.. సోషల్ మీడియా షేక్..
ABN, Publish Date - Sep 02 , 2025 | 11:41 AM
పవన్‌కు అభిమానులే కాదు.. అంతకుమించి అభిమానించే భక్తులున్నారు. అభిమానుల కోసం ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. సినిమా హీరో, జనసేనాని ఇవి కాకుండా ఆయన వ్యక్తిత్వానికి అభిమానులు మరింత ఎక్కువ. ఇది అభిమానులే కాదు.. సెలబ్రిటీ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట. మంగళవారం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం పవన్‌కు సంబంధించిన పోస్ట్‌లతో నిండిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్పెషల్ మ్యాష్‌అప్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘ఈశ్వరా.. పవనేశ్వరా..’ అంటూ మొదలైన ఏడు నిమిషాల 27 సెకెన్ల వీడియోలో ఆయన సినీ జీవితంతోపాటు రాజకీయ రంగంలోని ఒడుదొడుకులను చూపించారు. పవన్ చెప్పిన భావోద్వేగ సంభాషణలు.. ఆయన స్పీచ్‌లు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
Updated at - Sep 02 , 2025 | 02:27 PM