Karan Johar: కామెడీ డ్రామాలో తమన్నా
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:25 PM
మిల్కీ బ్యూటీ తమన్నా... ఆల్కహాల్ స్టార్ట్ అప్ ను ప్రారంభిస్తోంది, అయితే ఇది నిజ జీవితంలో కాదు సుమా... ఓ వెబ్ సీరిస్ లోనే!
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ... గత కొంతకాలంగా ఉత్తరాది సినిమాలు, వెబ్ సీరిస్ లపై దృష్టి పెట్టింది. వాటి జయాపజయాల సంగతి ఎలా ఉన్నా... ఆమెకు మాత్రం కావాల్సినంత ఫేమ్ వీటి ద్వారా వస్తోంది. ఇక తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే... మూవీ సూపర్ డూపర్ హిట్ అనే కొత్త సెంటిమెంట్ ఒకటి చిత్రసీమలో స్థిరపడిపోయింది. దాంతో తమన్నా క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే... ఇప్పుడు తమన్నా వెబ్ సీరిస్ మీద కూడా బాగానే దృష్టి పెట్టింది. ఆమె నటించిన తాజా వెబ్ సీరిస్ 'డు యూ వన్నా పార్ట్ నర్' (Do You Wanna Partner) సెప్టెంబర్ 12 నుండి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఇందులో తమన్నాతో పాటు ఆమె స్నేహితురాలుగా డయానా పెంటీ (Diana Penty) నటిస్తోంది. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు కలిసి పురుషాధిక్యత ఉన్న అల్కహాల్ రంగంలోకి అడుగుపెడతారు. అక్కడో స్టార్ట్ అప్ కంపెనీని ప్రారంభిస్తారు. ఈ బిజినెస్ లో వారికి ఎదురైన సమస్యలను ఏమిటీ? వాటిని ఎలా అధిగమించి, తమ సత్తాను చాటుకున్నారు? అనేది ఈ వెబ్ సీరిస్ లోని ప్రధానాంశం. ఈ ప్రైమ్ వీడియో ఒరిజినల్ కామెడీ డ్రామా ను ధర్మాటిక్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కరణ్ జోహార్, ఆదర్ పూనమ్ వాలా, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. దీన్ని కాలిన్ డి కున్హా, కుమార్ డైరెక్టర్ చేస్తున్నారు.
'డూ యూ వన్నా పార్ట్ నర్' న్యూ ఏజ్ కామెడీ అని, ఇందులో తమన్నా 'శిఖ' పాత్రను, డయానా పెంటీ 'అనహిత' రోల్ ను పోషిస్తున్నారని, ఇతర ప్రధాన పాత్రలలో జావేద్ జాఫ్రీ (Jaaved Jaafery), నకుల్ మెహతా (Nakuul Mehta), శ్వేతా తివారి (Shweta Tiwari), నీరజ్ కబి, సూఫీ మోతీవాలా, రణ్ విజయ్ సింగ్ తదితరులు కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ఈ వెబ్ సీరిస్ కు నందినీ గుప్తా, ఆర్ష్ వోరా, మిథున్ గంగోపాథ్యాయ్ రచన చేశారు.
Also Read: Inspector Zende: ఓటీటీకి.. వస్తోన్న చార్లెస్ శోభరాజ్ స్టోరీ! ఎప్పటినుంచంటే
Also Read: KGF: కళాదర్శకుడు, నటుడు దినేశ్ మంగళూరు మరణం