Tamanna Bhatia: జమున బయోపిక్‌లో!

ABN , First Publish Date - 2023-01-30T15:41:13+05:30 IST

తెలుగుతెర సత్యభామ, దక్షిణాదితోపాటు హిందీ ప్రేక్షకులను కూడా తనదైన శైలి నటనతో మెప్పించిన జమున ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆమె బయోపిక్‌ తీసే యోచనలతో తమిళ చిత్ర పరిశ్రమ ఉందట.

Tamanna Bhatia: జమున బయోపిక్‌లో!

తెలుగుతెర సత్యభామ,(jamuna as satyabhama) దక్షిణాదితోపాటు హిందీ ప్రేక్షకులను కూడా తనదైన శైలి నటనతో మెప్పించిన జమున ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆమె బయోపిక్‌ (jamuna biopic) తీసే యోచనలతో తమిళ చిత్ర పరిశ్రమ ఉందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్‌ డైరెక్టర్‌ ఈ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఆ దిశగా త్వరలో ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. జమున పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలిసింది. తమన్నా కూడా దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. (Tamanna Bhatia asa jamuna)

మహాపటి సావిత్రి బయోపిక్‌లో నటించి కీర్తి సురేశ్‌ చక్కని గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే! గడసరి అమ్మాయిగా, సత్యభామ లాంటి బరువైన పాత్రలకు ప్రాణం పోసిన జమున పాత్రలో తమన్నా ఎలా నటిస్తుందా.. అని అంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తమన్నా చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో సూపర్‌ హిట్‌ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌ ఇది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.

Updated Date - 2023-01-30T15:46:59+05:30 IST