Inspector Zende OTT: ఓటీటీకి.. వస్తోన్న చార్లెస్ శోభరాజ్ స్టోరీ! ఎప్పటినుంచంటే
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:11 PM
సీరియల్ కిల్లర్‌గా చార్లెస్ శోభరాజ్ కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో బయోపిక్ సినిమాలు, రియల్ క్రైమ్ థ్రిల్లర్లు విపరీతంగా ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అలాంటి జానర్‌లో ఓ సస్పెన్స్‌ఫుల్ థ్రిల్లర్ మూవీ ముస్తాబయింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో విశేష ప్రేక్షకాధరణ సంపాదించుకున్న నటుడు మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee) హీరోగా ఇన్‌స్పెక్టర్ జెండే (Inspector Zende) అనే కొత్త చిత్రం విడుదలకు సిద్దమైంది.ఈ సినిమా ముంబైకి చెందిన ప్రసిద్ధ పోలీసాఫీసర్ మాధవ్ జెండే నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం విశేషం.
1970. 80లలో మాధవ్ జెండే పోలీస్ విధుల్లో ఉండగా అప్పటికే సీరియల్ కిల్లర్‌గా, స్విమ్ ససూట్ కిల్లర్‌గా దేశ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచిన చార్లెస్ శోభరాజ్‌ను రెండు సార్లు పట్టుకున్నాడు. మొదట 1971లో తొలిసారి అరెస్టు చేయగా 1986లో తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. తర్వాత, గోవాలో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ స్టోరీనే సినిమాగా తెరకెక్కించారు. ఇందులో ఇన్‌స్పెక్టర్ మాధవ్ జెండే పాత్రలో మనోజ్ బాజ్‌పేయీ, క్రిమినల్ కార్ల్ భోజ్రాజ్ (చార్లెస్ శోభరాజ్)గా కుబేర ఫేం జిమ్ సార్భ్ ( Jim Sarbh), ఇతర పాత్రల్లో సచిన్ ఖేడేకర్, గిరిజా ఓక్, భలచంద్ర కదమ్, వైభవ్ మాంగలే తదితరులు నటించారు.
ఈ సినిమా మొత్తం సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, పోలీస్, క్రిమినల్ క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా ఉండనుంది. చిన్మయ్ డి. మండలేకర్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అయితే ఈ సినిమాను థియేటర్లకు తీసుకు రాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT )లో హిందీతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. అయితే మేకర్స్ తాజాగా సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ మరో ఇద్దరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ ట్రైలర్ చూస్తుంటే ఔట్ అండ్ క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలానే కాకుండా ప్రతి ఫ్రేమ్‌లో కామెడీ గ్యారెంటీ అనేలా ఉండి ఇట్టే ఆకట్టుకుంటుంది.