Tamanna as Ragini: రాగిణిగా తమన్నా

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:50 AM

ఇటు సినిమాలు, ఒక పక్క ఐటమ్‌ సాంగ్స్‌, మరో వైపు వెబ్‌ సిరీస్‌.. ఖాళీగా కూర్చోకుండా ఏది దొరికితే అది చేసేస్తున్న హీరోయిన్‌ ..

ఇటు సినిమాలు, ఒక పక్క ఐటమ్‌ సాంగ్స్‌, మరో వైపు వెబ్‌ సిరీస్‌.. ఖాళీగా కూర్చోకుండా ఏది దొరికితే అది చేసేస్తున్న హీరోయిన్‌ తమన్నా ఒక్కరేనేమో! ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లలో కొందరు ఇప్పటికే ఇంటికి వెళ్లిపోయినా తన గ్లామర్‌ను కాపాడుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు తమన్నా. ‘స్త్రీ 2’ సినిమాలో ఆమె చేసిన ‘ఆజ్‌ కీ రాత్‌’ పాట జనాన్ని ఊపేసింది. దీని వల్ల ‘వాన్‌’ సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. అలాగే ‘రాగిణి ఎంఎంఎస్‌’ మూడో ఫ్రాంఛైజీలో తమన్నా నటించనున్నారన్నది తాజా సమాచారం. హారర్‌ కథాంశంతో ‘రాగిణి ఎంఎంఎ్‌స’ చిత్రం తొలిసారిగా 2011లో వచ్చింది. 2014లో సెకండ్‌ పార్ట్‌ ప్రేక్షకులను పలకరించింది. అందులో సన్నీ లియోన్‌ నటించింది. ఆ సినిమాకు మూడో భాగం తీయాలనే ఆలోచన ఇప్పుడు ఏక్తాకపూర్‌కు రావడంతో తమన్నాను సంప్రదించారు. ఈ రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌లో నటించడానికి తమన్నా కూడా ఆసక్తి చూపించడంతో ఏక్తా ముందడుగు వేశారు. ఈ ఏడాది చివర్లో ‘రాగిణి ఎంఎంఎస్‌ 3’ చిత్రం సెట్స్‌పైకి రానుంది. దర్శకుడు, తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

Updated Date - Aug 23 , 2025 | 04:50 AM