Gangs of Godavari Trailer: మనమీదకి ఎవడన్నా వత్తే.. వాడి మీద పడిపోవడమే..!

ABN , Publish Date - May 25 , 2024 | 07:02 PM

వైవిధ్యమైన కథానాయకుడిగా దూసుకెళుతోన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.

Gangs of Godavari Trailer: మనమీదకి ఎవడన్నా వత్తే.. వాడి మీద పడిపోవడమే..!
Gangs of Godavari Movie Still

వైవిధ్యమైన కథానాయకుడిగా దూసుకెళుతోన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి (Neha Shetty) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి అంజలి (Anjali) కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మే 25 తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్‌లో జరిగింది. అభిమానుల కేరింతల నడుమ చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Gangs of Godavari Trailer Out)

*Love Me Movie Review: వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే...

ట్రైలర్ విషయానికి వస్తే.. ‘లంకల రత్న’ అనే శక్తివంతమైన పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తున్నారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు, తనదైన ఆహార్యం, అభినయంతో పాత్రకు నిండుదనం హైలెట్ అనేలా ఉన్నాయి. ఈ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆ పాత్ర ప్రయాణం ఎలా ఉండబోతుందో చూపించిన తీరు.. సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో ట్రైలర్ (GOG Trailer) ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. (Gangs of Godavari Trailer Talk)


GOG-Still.jpg

మనుషులను మూడు వర్గాలుగా వివరించే పాత్రతో ట్రైలర్ ప్రారంభమైతే, కథానాయకుడు వారిని ‘మగ’, ‘ఆడ’ మరియు ‘రాజకీయ నాయకులు’గా వర్గీకరించడంతో ముగుస్తుంది. అలాగే, లంకల రత్న పలికే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు కృష్ణ చైతన్య ప్రతిభ ట్రైలర్‌లో అడుగడుగునా కనిపించింది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉండబోతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిత్ మదాడి కెమెరా పనితనం, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ఈ ట్రైలర్‌కు హైలెట్ అనేలా ఉన్నాయి. అలాగే హీరోయిన్ పాత్రలో నేహా శెట్టి ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తే.. అంజలి పాత్ర హుందాగా కనబడింది. ఆమె పాత్రకు లంకాల రత్నతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా అయితే కట్ చేశారు. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా, తన కెరీర్‌లో ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని హీరో విశ్వక్‌సేన్ చెప్పిన మాటలను నిజం చేసేలా ట్రైలర్ ఉంది. మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ సినిమా విడుదలకాబోతోంది. (Gangs of Godavari Trailer Review)

Gangs-Of-Godavari-Still.jpg

Updated Date - May 25 , 2024 | 07:02 PM