Gangs of Godavari : మోత... మోత

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:13 AM

విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటున్న విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ మాస్‌ని మెప్పించే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో...

Gangs of Godavari : మోత... మోత

విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటున్న విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ మాస్‌ని మెప్పించే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. హోలీ సందర్బంగా ‘మోత’ పాటను విడుదల చేసి, పండగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది చిత్ర బృందం. అందాల తార ఆయేషా ఖాన్‌ ఈ ప్రత్యేక పాట కోసం విశ్వక్‌ సేన్‌తో కలసి చిందులు వేయడం అదనపు ఆకర్షణ. చంద్రబోస్‌ రాసిన ఈ మాస్‌ సాంగ్‌ను ఎం.ఎం. మానసి అభిమానుల్లో ఉత్సాహం నింపేలా పాడారు. థియేటర్లలో ఈ పాట మోత మోగించడం ఖాయం అంటున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 17న విడుదలయ్యే ఈ చిత్రానికి సహ నిర్మాతలు: వెంకట్‌ ఉప్పుటూరి, గోపీచంద్‌ ఇన్నమూరి , నిర్మాతలు: సూర్యదేవర నాగవంవవీ, సాయి సౌజన్య, రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య.

Updated Date - Mar 26 , 2024 | 12:13 AM