Gangs Of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మళ్లీ వాయిదా.. విడుదల ఎప్పుడంటే?

ABN , Publish Date - May 09 , 2024 | 07:33 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘లంకల రత్న’గా నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మే17న విడుదల కావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది.

Gangs Of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మళ్లీ వాయిదా.. విడుదల ఎప్పుడంటే?
Gangs Of Godavari Movie Still

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) ‘లంకల రత్న’గా నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs Of Godavari). కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఇటీవల మే 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా చెబుతూ.. మే 31న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Gangs Of Godavari Again Postponed)

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’ (Falaknuma Das)తో ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించాడు. ఇప్పుడు, విశ్వక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో దమ్మున్న గ్యాంగ్‌స్టర్ లంకల రత్నగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మే 31న ఫలక్‌నుమా దాస్ విడుదలైన తేదీనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం విడుదలవుతుండటం. విశ్వక్ సేన్ గత సెంటిమెంట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చాలా నమ్మకంతో ఉన్నారు.


Gangs-Of-Godavari.jpg

విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాపై ఇదే విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ ఆల్బమ్‌లోని ‘సుట్టంలా సూసి’ అనే మెలోడియస్ సాంగ్ ఇప్పటికే వైరల్‌గా మారింది. మే 10వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థీమ్ సాంగ్ ‘బ్యాడ్’ని చిత్ర బృందం విడుదల చేయనుంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌తో, మేకర్స్ ‘లంకల రత్న’ పాత్ర ఎలా ఉండనుంది? అతని ప్రపంచం ఎలా ఉండనుంది? అనేది స్పష్టత ఇచ్చేశారు. ఈ టీజర్ సినీ ప్రేమికులను ఆకర్షించింది. ఈ టీజర్ తర్వాత సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. విశ్వక్ సరసన నేహా శెట్టి (Neha Sshetty) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో, అంజలి (Anjali) కీలక పాత్రలో నటిస్తోంది.

Read Latest Cinema News

Updated Date - May 09 , 2024 | 07:33 PM