Nikhil: అప్పుడే నిఖిల్‌కు డైపర్ క్లాస్‌లు మొదలయ్యాయ్..

ABN , Publish Date - Feb 10 , 2024 | 10:39 PM

యంగ్ హీరోలలో నిఖిల్ ప్రత్యేక స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. ‘కార్తికేయ 2’ సినిమాతో ఆయన పాన్ ఇండియా హీరోగా మారారు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రీసెంట్‌గా నిఖిల్ తన భార్య సీమంతం ఫొటో షేర్ చేసి.. తాము పేరేంట్స్ కాబోతున్నామని ప్రకటించారు. ఇప్పుడు డైపర్ డ్యూటీ లెర్నింగ్ అంటూ నిఖిల్ ఓ వీడియో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది.

Nikhil: అప్పుడే నిఖిల్‌కు డైపర్ క్లాస్‌లు మొదలయ్యాయ్..
Hero Nikhil Siddharth Learning Diaper Duty

యంగ్ హీరోలలో నిఖిల్ (Nikhil) ప్రత్యేక స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో ఆయన పాన్ ఇండియా హీరోగా మారారు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో కత్తులు, యుద్ధాలు, గుర్రపు స్వారీ.. ఇలాంటి వన్నీ ఉంటాయనేలా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో రెండు మూడు సినిమాలు కమిటై ఉన్నారు. సినిమాల సంగతి అలా ఉంటే.. నిఖిల్ అతి త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ విషయాన్ని నిఖిల్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇప్పుడు తండ్రిగా తన బాధ్యతలను తెలుసుకుంటున్నానని చెబుతూ ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

10 రోజుల క్రితం తన భార్య పల్లవి సీమంతపు వేడుక ఫొటోని షేర్ చేసిన నిఖిల్.. ‘‘సీమంతం .. బేబీ షవర్ యొక్క సాంప్రదాయ భారతీయ రూపం. అతి త్వరలో మేము మా మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. దయచేసి మీ ఆశీస్సులు అందివ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. నిఖిల్ చేసిన ఈ పోస్ట్‌కి నెటిజన్లు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా ఓ వీడియోని షేర్ చేసిన నిఖిల్.. ‘డైపర్ డ్యూటీని నేర్చుకుంటున్నాను.. త్వరలో బేబీ వచ్చేస్తోంది’ అంటూ పోస్ట్ చేశారు.


Nikhil-and-Pallavi.jpg

ఈ వీడియోలో చిన్న పిల్లలకు డైపర్ ఎలా వేయాలో నిఖిల్ ఓ బొమ్మతో ప్రాక్టీస్ చేస్తుంటే.. తన భార్య, స్నేహితులు సంతోషంగా నిఖిల్ పనిని వీక్షిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా కరోనా టైమ్‌లో 2020లో కరోనా ఆంక్షల మధ్య పల్లవిని నిఖిల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వృత్తి రీత్యా డాక్టర్ అయిన పల్లవిని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగు సంవత్సరాల తర్వాత.. వారు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Devara: మరో హీరోయిన్ ఈ మరాఠీ బ్యూటీనా.. ఫొటోలు వైరల్

******************************

*Priyamani: అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా..

******************************

*Bade Miyan Chote Miyan: ఉత్కంఠ పెంచేస్తోన్న ‘బడే మియా చోటే మియా’ మేకింగ్ వీడియో

************************

*Sharathulu Varthisthayi: దర్శకుడు దేవ కట్టా కూడా ఓ చెయ్యి వేశారు

******************************

Updated Date - Feb 10 , 2024 | 10:40 PM