Devara: మరో హీరోయిన్ ఈ మరాఠీ బ్యూటీనా.. ఫొటోలు వైరల్

ABN , Publish Date - Feb 10 , 2024 | 10:13 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ. కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా మరాఠీ బ్యూటీ శ్రుతి మరాటే సెలక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Devara: మరో హీరోయిన్ ఈ మరాఠీ బ్యూటీనా.. ఫొటోలు వైరల్
Jr NTR And Janhvi Kapoor

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ (Devara). ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై కొరటాల శివ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్.. ఓ రేంజ్‌లో సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఏప్రిల్ 5న విడుదల అంటూ అఫీషియల్‌గా వార్తలు వచ్చినప్పటికీ.. వాయిదా పడే అవకాశం ఉందనేలా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మరో వార్త ‘దేవర’ను ట్రెండింగ్‌లోకి తెచ్చింది. అదేమంటే.. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా మరాఠీ బ్యూటీ నటించబోతోందంటూ.. ఆ భామకు సంబంధించిన ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుండటంతో.. ‘దేవర’ ఒక్కసారిగా వార్తలలో హైలెట్ అవుతున్నాడు. (Devara Second Heroine)

‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. అందులో ఓ పాత్రకి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌ అయితే.. రెండో పాత్రకి మరాఠీ బ్యూటీ శ్రుతి మరాటే (Shrutii Marrathe) హీరోయిన్ అనేలా టాక్ మొదలైంది. అయితే మేకర్స్ నుంచి ఈ విషయమై అధికారిక సమాచారం మాత్రం రాలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్ పేజీలలో మాత్రం శ్రుతి మరాటే ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది నిజం కాదు అనడానికి వీలు లేకుండా.. శ్రుతి మరాటే కూడా తన ఇన్‌స్టా స్టేటస్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్ పేజీని పోస్ట్ చేయడం విశేషం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన ఎప్పుడొస్తుందనేది చూడాలి.


Shrutii-Marrathe.jpg

ఇదిలా ఉంటే.. కొందరు నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులు.. శ్రుతి మరాటే ఫొటోలను చూసి.. జాన్వీ కంటే ఈ భామ బాగుంది.. ఈమెనే మెయిన్ హీరోయిన్‌ని చేయండి అంటూ టీమ్‌కి సలహాలు కూడా ఇస్తున్నారు. కొందరు లక్కీ ఛాన్స్ కొట్టేశావ్ పో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈ భామ ఫొటోలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ. కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Priyamani: అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా..

******************************

*Bade Miyan Chote Miyan: ఉత్కంఠ పెంచేస్తోన్న ‘బడే మియా చోటే మియా’ మేకింగ్ వీడియో

************************

*Sharathulu Varthisthayi: దర్శకుడు దేవ కట్టా కూడా ఓ చెయ్యి వేశారు

******************************

Updated Date - Feb 10 , 2024 | 10:38 PM