Sharathulu Varthisthayi: దర్శకుడు దేవ కట్టా కూడా ఓ చెయ్యి వేశారు

ABN , Publish Date - Feb 10 , 2024 | 06:29 PM

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం.. ఈ సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు దేవ కట్టా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Sharathulu Varthisthayi: దర్శకుడు దేవ కట్టా కూడా ఓ చెయ్యి వేశారు
Sharathulu Varthisthayi Team with Director Deva Katta

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’ (Sharathulu Varthisthayi). కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం.. ఈ సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ (Paala Pittalle Preme Vaale) అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు దేవ కట్టా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

ఈ పాట విడుదల అనంతరం డైరెక్టర్ దేవ కట్టా (Deva Katta) మాట్లాడుతూ.. ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’ సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. చైతన్య నాకు బాగా ఇష్టమైన యాక్టర్. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, మ్యారేజి సాంగ్ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఈ కంటెంట్ చూస్తుంటే ఇదొక మంచి రూటెడ్ మూవీగా అర్థమవుతోంది. ఈ సినిమా సైలెంట్‌గా రిలీజై.. పెద్ద సక్సెస్ అయ్యే సినిమాలా అనిపిస్తోంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నారు.


Deva-Katta.jpg

పాట విషయానికి వస్తే.. హీరో హీరోయిన్ల మధ్య సాగే బ్యూటీఫుల్ లవ్ సాంగ్‌గా ఈ ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ (Paala Pittalle Preme Vaale Song) పాటను చిత్రీకరించారు. ఈ పాటకు మల్లెగోడ గంగాప్రసాద్ లిరిక్స్ అందించగా.. అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. హరిచరణ్, భార్గవి పిళ్లై పాడారు. ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె.. పూల సెట్టల్లే ఊగే.. ఈడు రంగుల్లో సింగిడొచ్చే.. రెండు గుండెల్లో నిండే, ఓ గడియలో సెరుకు సెక్కరై కరిగెలే.. ఈ చెలిమి తీపి చిలకలే కలిసెలే’ అంటూ లవ్ ఫీలింగ్స్ చెబుతూ ఆకట్టుకునేలా ఈ పాటను రూపొందించారు. కాగా, ఈ పాటను విడుదల చేసిన దర్శకుడు దేవ కట్టాకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది.


ఇవి కూడా చదవండి:

====================

*హ్యాట్రిక్ సక్సెస్.. సుహాస్ ఎమోషనల్ లెటర్

**************************

*Kayal Anandhi: ఈ సినిమా నా సినీ ఇమేజ్‌ను మార్చేస్తుంది

******************************

*మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు అందిన ఆహ్వానం..

**************************

Updated Date - Feb 10 , 2024 | 06:29 PM