Bade Miyan Chote Miyan: ఉత్కంఠ పెంచేస్తోన్న ‘బడే మియా చోటే మియా’ మేకింగ్ వీడియో

ABN , Publish Date - Feb 10 , 2024 | 07:11 PM

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈద్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

Bade Miyan Chote Miyan: ఉత్కంఠ పెంచేస్తోన్న ‘బడే మియా చోటే మియా’ మేకింగ్ వీడియో
Bade Miyan Chote Miyan Movie Still

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff)తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan). అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈద్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక రెండు వారాల క్రితం విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. (Bade Miyan Chote Miyan Making Video)

ఈ మేకింగ్ వీడియో చూస్తేనే ఉత్కంఠ పెరిగిపోయేలా ఉంది. అంత అద్భుతంగా యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. సర్రున దూసుకుపోయే ఫ్లైట్స్, ఛేజింగ్ సన్నివేశాలు, బ్లాస్టింగ్ సీన్స్ ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఈ యాక్షన్ సన్నివేశాల గురించి డైరెక్టర్ అలీ అబ్బాస్ మాట్లాడుతూ.. యాక్షన్ చిత్రాల పట్ల మీకు అంత ఆసక్తి ఎందుకు? అంటే నాదగ్గర సమాధానం లేదు. కానీ ఈ చిత్రం యాక్షన్ లవర్స్‌కి పండగలా ఉంటుంది. యాక్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి సన్నివేశం రా, రస్టిక్‌గా.. అలాగే రియలిస్టిక్‌గా ఉంటుందని అన్నారు. 


Akshay.jpg

కాగా.. ముంబై, లండన్, అబుదాబి, స్కాట్లాండ్, జోర్డాన్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఒకేసారి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మధ్య యాక్షన్ చిత్రాలు ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. మరి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రం ఏ రేంజ్ సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి..


ఇవి కూడా చదవండి:

====================

*Sharathulu Varthisthayi: దర్శకుడు దేవ కట్టా కూడా ఓ చెయ్యి వేశారు

******************************

*హ్యాట్రిక్ సక్సెస్.. సుహాస్ ఎమోషనల్ లెటర్

**************************

*Kayal Anandhi: ఈ సినిమా నా సినీ ఇమేజ్‌ను మార్చేస్తుంది

******************************

*మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు అందిన ఆహ్వానం..

**************************

Updated Date - Feb 10 , 2024 | 07:11 PM