Priyamani: అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా..

ABN , Publish Date - Feb 10 , 2024 | 08:10 PM

విలక్షణ నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భామాకలాపం 2’. ఫిబ్రవరి 16 నుంచి ఈ మూవీ నేరుగా ఆహాలో రిలీజ్ అవుతుంది. సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ట్రైలర్‌ను విజయవాడలోని రెయిన్ ట్రీ పార్క్ కమ్యూనిటీలో రిలీజ్ చేశారు. ఆ కమ్యూనిటీలో ఉండే మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ట్రైలర్ విడుదల వేడుకలో పాల్గొని.. ప్రియమణి, సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్‌తో మాట్లాడారు.

Priyamani: అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నా..
Priyamani

విలక్షణ నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భామాకలాపం 2’ (Bhamakalapam 2). ఫిబ్రవరి 16 నుంచి ఈ మూవీ నేరుగా ఆహాలో రిలీజ్ అవుతుంది. సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ట్రైలర్‌ను విజయవాడలోని రెయిన్ ట్రీ పార్క్ కమ్యూనిటీలో రిలీజ్ చేశారు. ఆ కమ్యూనిటీలో ఉండే మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ట్రైలర్ విడుదల వేడుకలో పాల్గొని.. ప్రియమణి, సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్‌తో మాట్లాడారు.

Bhama.jpg

ఈ కార్యక్రమంలో ప్రియమణి (Priyamani) మాట్లాడుతూ.. ‘భామాకలాపం’ పెద్ద సక్సెస్ అయ్యింది. ‘భామాకలాపం 2’ని కూడా పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఓటీటీలకు విశేష స్పందన వస్తుండటంతో ఆహా కోసం ఈ సినిమా చేశాము. ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్‌కు వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది. ఇక నాకు పూర్తి స్థాయి విలన్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. ‘నరసింహ’ చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం, హీరోతో సమానంగా ఉండే విలన్ పాత్రని నేను పోషించాలని అనుకుంటున్నాను. హిందీలో నటించిన ‘ఆర్టికల్ 370’, అజయ్ దేవగన్‌తో నటించిన ‘మైదాన్’ విడుదలకు సిద్ధమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించడం పట్ల సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశారు. (Bhamakalapam 2 Trailer Lanch Event)


Bhama-Kalapam-2.jpg

‘భామాకలాపం 2’ ట్రైలర్‌ను విషయానికి వస్తే... అనుపమ (ప్రియమణి) తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో వంటల కార్యక్రమాన్ని నిర్వహించే ఓ మహిళగా కనిపిస్తుంది. ఆమె ఊహించని పరిస్థితుల్లో ఓ సమస్యలో చిక్కుకుంటుంది. మరో వైపు నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ డ్రగ్స్‌ను పట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. అసలు డ్రగ్స్ మాఫియా ఎలాంటి పథకం వేసింది. దాన్ని నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ ఎలా గుర్తించింది.. దాన్ని అరికట్టడానికి ఏం చేసింది? మరో వైపు అనుపమ ఎలాంటి సమస్యలో చిక్కుకుంది. ఆమెకు, కీలక పాత్రలో నటించిన సీరత్ కపూర్ పాత్రకు ఉన్న లింకేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న ఆహాలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌కి వస్తున్న ఈ ‘భామాకలాపం 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Bade Miyan Chote Miyan: ఉత్కంఠ పెంచేస్తోన్న ‘బడే మియా చోటే మియా’ మేకింగ్ వీడియో

************************

*Sharathulu Varthisthayi: దర్శకుడు దేవ కట్టా కూడా ఓ చెయ్యి వేశారు

******************************

*హ్యాట్రిక్ సక్సెస్.. సుహాస్ ఎమోషనల్ లెటర్

**************************

Updated Date - Feb 10 , 2024 | 08:11 PM