40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Guntur Kaaram: రెండో రోజూ రమణగాడు రాంప్ ఆడేశాడు.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ABN, Publish Date - Jan 14 , 2024 | 12:28 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను రాబట్టగా.. రెండో రోజు కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఈ సినిమా రూ. 33 కోట్లను కలెక్ట్ చేసింది.

Guntur Kaaram Movie Still

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ సంక్రాంతి (Sankranthi) కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను సాధించి రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రెండో రోజూ రమణగాడు బాక్సాఫీస్ దగ్గర రాంప్ ఆడేశాడు. తాజాగా మేకర్స్ రెండు రోజుల కలెక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Guntur Kaaram 2 Days Collections)

మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ‘గుంటూరు కారం’ రెండు రోజులకుగానూ రూ. 127 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. రమణగాడి సూపర్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా మేకర్స్ ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజూ రూ. 33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. రెండో రోజు ఈ సినిమాకు పోటీగా థియేటర్లలో రెండు సినిమాలు (హనుమాన్, సైంధవ్ రిలీజ్) ఉన్నప్పటికీ రూ. 33 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే మాములు విషయం కాదు. అందుకే సూపర్ స్టార్ రాంపేజ్ (Super Star Rampage) ఇది అని కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అభిమానం చాటుకుంటున్నారు. (Mahesh Babu Guntur Kaaram Movie)


వాస్తవానికి ఈ సినిమాకు మొదటి రోజు టాక్ అంత బాగా ఏం రాలేదు. అది, ఇది అంటూ కొందరు కావాలని సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయడం మొదలెట్టారు. కానీ, ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సూపర్ స్టార్ బాక్సాఫీస్ సునామీ ముందు అవేం నిలబడటం లేదు. మూడో రోజు (ఆదివారం) కూడా ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయంటే.. ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఓన్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ పోస్టర్‌తో పాటు ‘ఈ భోగికి మీలో ఉన్న Egos మరియు Haterd కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికి భోగి శుభాకాంక్షలు’ అని మేకర్స్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*నిర్మాత వివేక్ కూచిభొట్ల‌ను బెదిరిస్తోన్న సినీ రచయితపై కేసు నమోదు

************************

*‘హను-మాన్’కు థియేటర్లు ఇవ్వని వారిపై TFPC సీరియస్

***********************

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది, మహేష్ బాబు స్టామినా!

**************************

*Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది

************************

*‘హను-మాన్’ రెస్పాన్స్ చూసి.. గూస్ బంప్స్ వస్తున్నాయట..

************************

Updated Date - Jan 14 , 2024 | 12:28 PM