Balakrishna: నేనూ మొదట్లో కెమెరామెన్ అవుదామని అనుకున్నా..

ABN , Publish Date - May 24 , 2024 | 10:35 PM

‘సత్యభామ’ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. పారిజాతపహరణం సమయంలో శ్రీకృష్ణుడి వెంట ఉన్నది ‘సత్యభామ’. ఆమె వెంట ఉంటే విజయం ఖాయం. సత్యభామ అనే పేరు వుమెన్ ఎంపవర్‌మెంట్‌కు ప్రతీకగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడికి ఎందరు భార్యలు ఉన్నా సత్య తన చెప్పుచేతల్లో ఆయనను పెట్టుకుంది. అలాంటి పేరుతో కాజల్ చేసిన ఈ సినిమా సక్సెస్ కావాలని కోరారు నటసింహం నందమూరి బాలకృష్ణ.

Balakrishna: నేనూ మొదట్లో కెమెరామెన్ అవుదామని అనుకున్నా..
Natasimham Balakrishna

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘సత్యభామ’ (Satyabhama). నవీన్ చంద్ర ఇందులో అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవగా.. శుక్రవారం హైదరాబాద్‌లో నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (Satyabhama Trailer Launch Event)

*Tollywood: చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు


ఈ కార్యక్రమంలో నటసింహం బాలకృష్ణ (Natasimham Balayya Speech) మాట్లాడుతూ.. ‘‘ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత షూటింగ్‌లో పాల్గొనాలని.. యమా ఉత్సాహంతో వచ్చా. కానీ నా సినిమా షూటింగ్ ఇంక మొదలు కాలేదు. దాదాపు 45 రోజులుగా కెమెరాను చూడలేదు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈ‌వెంట్‌లో చూస్తున్నాను. ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. చిత్ర దర్శకుడు సుమన్ చిక్కాల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు, సమర్పకులు శశికిరణ్ తిక్క.. అందరికీ కంగ్రాట్స్. వీళ్లకు ప్రొడక్షన్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్‌లోనూ అనుభవం ఉంది. వీళ్లంతా కలిసి అవురమ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి.. సినిమాలు నిర్మించడం సంతోషంగా ఉంది. ఉగాది పచ్చడిలా సినిమా ఇండస్ట్రీలోని అన్ని అనుభవాలు వీరికి తెలుసు. ఆ అనుభవంతోనే ‘సత్యభామ’ అనే సూపర్ హిట్ సినిమా చేశారని నమ్ముతున్నాను.


Balakrishna.jpg

‘సత్యభామ’ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. పారిజాతపహరణం సమయంలో శ్రీకృష్ణుడి వెంట ఉన్నది ‘సత్యభామ’. ఆమె వెంట ఉంటే విజయం ఖాయం. సత్యభామ అనే పేరు వుమెన్ ఎంపవర్‌మెంట్‌కు ప్రతీకగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడికి ఎందరు భార్యలు ఉన్నా సత్య తన చెప్పుచేతల్లో ఆయనను పెట్టుకుంది. మహిళలు ఈ రోజు పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందుండటం సంతోషకరం. ‘భగవంత్ కేసరి’లో నేను బనో బేటీకో షేర్ అని అంటే కాజల్ సత్యభామ సినిమాతో బనో కాచీకో షేర్ అంటూ ఫైట్స్ చేసింది. ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలు చేయాలి. కాజల్ సత్యభామతో ఆ ప్రయత్నం చేసింది. విష్ణు కెమెరా పనితనం బాగుంది. నేనూ మొదట్లో కెమెరామెన్ అవుదామని అనుకున్నా. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ చాలా బాగుంది. తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఉందంటే అందుకు కారణం మనకున్న మంచి ప్రేక్షకులు. ఈ రోజు నారద జయంతి. నాన్నగారు అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు. ఒక్క నారదుడు తప్ప. నేను ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో నారదుడిగా నటించా. నాన్న గారు చేయని క్యారెక్టర్ ఒకటి నేను చేయడం సంతృప్తినిస్తుంటుంది. (Balakrishna at Satyabhama Event)

‘సత్యభామ’ ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మెప్పించగలదు. 16 ఏళ్లలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. అన్నింటిలోకి పరకాయ ప్రవేశం చేసింది. వైవాహిక జీవితంలోకి వెళ్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ మా ‘భగవంత్ కేసరి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్స్ పెళ్లయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతుంటారు. ఆ టైప్ కాస్ట్‌ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెకున్న ఎనర్జీకి హ్యాట్సాఫ్. మొదటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నాను. కాజల్‌తో నటించాలని ఉండేది. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. ‘భగవంత్ కేసరి’లో మేము కలిసి పనిచేయడం ఒక మంచి ఎక్సీపిరియన్స్. ‘భగవంత్ కేసరి’లో కాజల్, ఈ సినిమాలో కాజల్ ఒక్కరేనా అనిపించేలా ఉంది. ‘సత్యభామ’ సినిమాకు మంచి టీమ్ పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. జూన్ 7న థియేటర్స్‌లో చూడండి’’ అని చెప్పుకొచ్చారు.

Read Latest Cinema News

Updated Date - May 24 , 2024 | 10:35 PM