Satyabhama: కాజల్ ‘సత్యభామ’ నుంచి ‘కళ్లారా’ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:54 PM

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘సత్యభామ’. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘కళ్లారా..’ను గురువారం రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం 3.06 నిమిషాలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Satyabhama: కాజల్ ‘సత్యభామ’ నుంచి ‘కళ్లారా’ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే
Naveen Chandra and Kajal Aggarwal

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ (Queen of Masses) కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘కళ్లారా..’ (Satyabhama First Single)ను గురువారం రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం 3.06 నిమిషాలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

*Rama Naidu: బెంగాలీ సినిమా తీయడం వలన 'జీటీ' ఎక్స్ ప్రెస్ తెనాలిలో ఆగింది, అదెలా అంటే..


‘కళ్లారా..’ పాట విషయానికి వస్తే.. క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ (Queen of Melody Shreya Ghoshal) ఈ పాటను ఆలపించారు. కాజల్, నవీన్ చంద్ర (Kajal and Naveen Chandra)ల మధ్య లవ్ మేకింగ్ సాంగ్‌గా ఈ పాట ఉండబోతోంది. ‘సత్యభామ’ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు.


Satyabhama.jpg

ఈ సినిమాను అవురమ్ ఆర్ట్స్ (Aurum Arts) పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క (Sasikiran Thikka) సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల (Suman Chikkala) రూపొందించారు. ఈ సినిమా మే 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. పెళ్లి తర్వాత కాజల్ చేస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.

Read Latest Cinema News

Updated Date - Apr 24 , 2024 | 02:54 PM