Satyabhama: ‘సత్యభామ’గా కాజల్.. టీజర్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-11-04T16:32:33+05:30 IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న కొత్త సినిమా ‘సత్యభామ’. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ని దీపావళికి విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.

Satyabhama: ‘సత్యభామ’గా కాజల్.. టీజర్ ఎప్పుడంటే?
Kajal Aggarwal in Satyabhama

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లీడ్ రోల్‌లో నటిస్తోన్న కొత్త సినిమా ‘సత్యభామ’ (Satyabhama). ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క (Shashi Kiran Tikka) సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి సుమన్ చిక్కాల (Suman Chikkala) దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ ఓ అప్‌డేట్ వదిలారు.

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 11న ‘సత్యభామ’ సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన బాబీ తిక్క మాట్లాడుతూ.. మా ‘సత్యభామ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తిచేశాం. ఇటీవలే హైదరాబాద్‌లో కాజల్ అగర్వాల్ పాల్గొన్న కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించాం. ఈ నెల రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నాం. దీపావళి సందర్భంగా ఈ నెల 11న చిత్ర టీజర్‌ను రిలీజ్ చేస్తాం. వచ్చే సమ్మర్‌కు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘సత్యభామ’గా మిమ్మల్ని ఆకట్టుకుంటారని అన్నారు. (Satyabhama Teaser Release Update)


Kajal-Aggarwal.jpg

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj), నవీన్ చంద్ర (Naveen Chandra) తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాపై కాజల్ అగర్వాల్ ఎంతగానో నమ్మకంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, తనకు మొదటి నుంచి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలని ఉండేదని, ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

========================

*Bharateeyudu 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇక లంచగొండులకు మూడినట్టే!

**************************************

*Junior Balaiah: జూనియర్‌ బాలయ్య ఇకలేరు

*************************************

*Dayaa: జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడిగా అవార్డ్

**************************************

Updated Date - 2023-11-04T16:32:34+05:30 IST