Exclusive: టాలీవుడ్‌‌లోకి మరో కన్నడ సోయగం.. ఎంతందంగా ఉందో చూశారా!

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:50 PM

రష్మిక, పూజ హెగ్డే లాంటి కన్నడ భామలు తెలుగులో అరంగేట్రం చేసిన తరువాత మంచి పేరుతెచ్చుకొని హిందీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టారు. రష్మిక అయితే ఏకంగా నేషనల్ క్రష్ అయిపొయింది. ఇప్పుడు ఇంకో అందమైన కన్నడ అమ్మాయి తెలుగులోకి అడుగు పెడుతోంది. ఆమె ఎవరి పక్కన చేస్తోందో తెలుసా...

Exclusive: టాలీవుడ్‌‌లోకి మరో కన్నడ సోయగం.. ఎంతందంగా ఉందో చూశారా!
Kannada actress Sampada is all set to make her debut in Tollywood

రష్మిక మందన్న, పూజ హెగ్డే, కృతి శెట్టి, నేహా శెట్టి, నభ నటేష్, శ్రద్ధ శ్రీనాథ్ ఇంకా చాలామంది నటీమణులు తెలుగులో ఆరంగేట్రం చేశారు, ఇక్కడ తమ సత్తా చాటుతున్నారు. ఇందులో రష్మిక మందన్న, పూజ హెగ్డే లు ఇప్పుడు హిందీ సినిమాలు కూడా చేస్తున్నారు. రష్మిక మందన్నని అయితే ఏకంగా నేషనల్ క్రష్ అని పిలుస్తున్నారు కూడా. ఇలా కన్నడ భామలు తెలుగు సినిమాలో ఆరంగేట్రం చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా నేహా శెట్టి 'డీజే టిల్లు' సినిమాలో చేసి రాధిక అంటే ఆమెనే గుర్తుకు తెచ్చుకుంటున్నారు, అంతగా ప్రభావం చేసింది ఆమె పాత్ర ఆ సినిమాలో.

sampada.jpg

ఇదే వరసలో ఇప్పుడు ఇంకొక కన్నడ భామ టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతోంది అని వినిపిస్తోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు కన్నడంలో తన అందాలతో అందరినీ ఆకర్షిస్తున్న కన్నడ బ్యూటీ సంపద. ఈమె 'మిథున రాశి' అనే కన్నడ సీరియల్ తో ఎంతో సంచలనం అయింది. సంపద అంటే తెలియని కన్నడిగులు లేరు అన్నంత పేరు సంపాదించింది ఆ సీరియల్ తో. 22 ఏళ్ళ సంపద మోడల్ కూడాను, అలాగే కన్నడంలో సినిమాలు కూడా చేస్తోంది అని వినికిడి.

sampadaone.jpg

ఇప్పుడు ఈ కన్నడ బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేయబోతోంది అని తెలుస్తోంది. ఇంతకీ ఎవరితో అనుకుంటున్నారా? వైవిధ్య నటుడు సందీప్ కిషన్ పక్కన అతని రాబోయే సినిమాలో సంపదని తీసుకోవాలని చిత్ర నిర్వాహకులు అంకుంటున్నట్టుగా భోగట్టా. సందీప్ కిషన్ తో దర్శకుడు నక్కిన త్రినాథ రావుతో అధికారికంగా ఒక సినిమా కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

sampadatwo.jpg

ఈ సినిమాని ఏకె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దందా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక వినోదభరిత కథా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ప్రముఖ క్యారెక్టర్ నటుడు రావు రమేష్ ఒక ప్రధాన పాత్రలో కనపడతారని కూడా వినికిడి. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది అని, అందుకోసమని కథానాయిక ఎంపిక కోసం ఈ కన్నడ బ్యూటీ సంపద ని హైదరాబాదు తీసుకువస్తున్నట్టుగా వినికిడి.

sampadathree.jpg

ఈ సినిమాకి బెజవాడ ప్రసన్న కుమార్ కథని అందించారు. ఈ కథ తండ్రీ, కొడుకుల మధ్య జరిగే ఒక వినోదాత్మకమైన నేపధ్యలో సాగుతుంది అని, ఆ రెండు పాత్రల్లో సందీప్ కిషన్, రావు రమేష్ లు ఇప్పటికే ఫిక్స్ అయ్యారని తెలిసింది. ఇప్పుడు కథానాయిక కోసం అన్వేషించి కన్నడ అమ్మాయి సంపదని అందుకోసం ఎంపిక చేసినట్టుగా తెలిసింది. సంపద చాలా అందంగా, చక్కగా సందీప్ కిషన్ ని బాగా సూట్ అవుతుందని కూడా నిర్వాహకులు అనుకుంటున్నారు.

sampadafour.jpg

బెంగళూరులో పుట్టి పెరిగిన సంపద పాఠశాల విద్యను బెంగుళూరులో ప్రతిష్టాత్మక పాఠశాలలలో ఒకటైన సోఫియాస్ హై స్కూల్ లో పూర్తి చేసింది. తరువాత మౌంట్ కార్మెల్ కాలేజీలో చేరి టూరిజంలో డిగ్రీ పూర్తి చేసింది. ముందుగా మోడల్ గా తన కెరీర్ ని ఆరంభించిన సంపద, అనేక వాణిజ్య ప్రకటనల కోసం మోడల్ గా చేసింది కూడాను.

sampadasaree.jpg

మోడల్ గా పని చేసిన తరువాత, సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాలని ఇక్కడ కూడా తన ప్రతిభా పాటవాలను చూపించాలని అనుకుంది. అప్పుడు 'మిథున రాశి' అనే కన్నడ సీరియల్‌ లో ఆమెకి అవకాశం రావటం, ఆ సీరియల్ మెగా హిట్ అవటం, సంపదకు మంచి పేరు రావటం అన్నీ అలా జరిగిపోయాయి. ఈ సీరియల్ ఎంత పెద్ద విజయం సాధించింది అంటే, ఆమె పేరు ప్రతి ఇంట్లో మారుమోగేటట్టు చేసింది.

కన్నడంలో నిఖిల్ గౌడ పక్కన 'రైడర్' అనే సినిమాలో సంపద చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమాకి తెలుగు దర్శకుడు విజయకుమార్ కొండా దర్శకుడు.

Updated Date - Apr 16 , 2024 | 02:56 PM