పుష్ప 2 కు బాలీవుడ్‌ దర్శకుడి ప్రశంసలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:26 AM

‘ఇప్పుడే ‘పుష్ప 2’ టీజర్‌ చూశా. అద్భుతంగా ఉంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటన నాకు బాగా నచ్చింది. ఆ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’...

పుష్ప 2 కు బాలీవుడ్‌ దర్శకుడి ప్రశంసలు

‘ఇప్పుడే ‘పుష్ప 2’ టీజర్‌ చూశా. అద్భుతంగా ఉంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటన నాకు బాగా నచ్చింది. ఆ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా. బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మ. ‘గదర్‌ 2’ చిత్రంతో సూపర్‌ హిట్‌ సాధించిన ఈ దర్శకుడు తన ప్రశంసలను కొనసాగిస్తూ ‘గత ఏడాది ఆగస్టు 15న నా చిత్రం ‘గదర్‌ 2’ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ ఏడాది అదే రోజున ‘పుష్ప 2’ రిలీజ్‌ అవుతోంది. ఇది కూడా తప్పకుండా హిట్‌ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు, ఈ సినిమా టీమ్‌కు నా అభినందనలు’ అన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 03:26 AM