Shraddha Das: కాస్త గ్యాప్ తర్వాత.. నేను కూడా ట్రై చేశా!

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:52 PM

గ్లామర్ పరంగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న సినిమా చేశానని అన్నారు గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్‌కు ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ నెల 16న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా మేకర్స్ నిర్వహించారు.

Shraddha Das: కాస్త గ్యాప్ తర్వాత.. నేను కూడా ట్రై చేశా!
Heroine Shraddha Das

గ్లామర్ పరంగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న సినిమా చేశానని అన్నారు గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das). చైతన్య రావు, సునీల్ (Sunil), శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam). వనమాలి క్రియేషన్స్ పతాకంపై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్‌కు ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్‌లైన్. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌‌ను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్ ఈవెంట్’ (Paarijatha Parvam Pre Release Event) పేరుతో వెరైటీగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.

*Exclusive: టాలీవుడ్‌‌లోకి మరో కన్నడ సోయగం.. ఎంతందంగా ఉందో చూశారా!


ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రద్ధాదాస్ (Heroine Shraddha Das) మాట్లాడుతూ.. కాస్త గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు సినిమా చేశాను. గ్లామర్ పరంగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న సినిమా ‘పారిజాత పర్వం’. ఇందులో నా పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. నా కోసం ఈ పాత్రను రాసిన డైరెక్టర్ సంతోష్‌కి థ్యాంక్యూ. ఇందులో కొన్ని సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి నిర్మాతలు ఉంటే ప్రతి ఒక్కరికీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సునీల్, హర్ష, చైతన్యతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ల కామెడీ టైమింగ్‌‌ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. కానీ నేను కూడా కాస్త ట్రై చేశా. ఈ సినిమాను ఏప్రిల్ 19న అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.


Shraddha-Das.jpg

హీరో చైతన్య రావు (Hero Chaitanya Rao) మాట్లాడుతూ.. నిర్మాతలు మహీధర్, దేవేష్ నిజంగా అద్భుతమైన నిర్మాతలు. ఎంతో బిజీగా ఉన్న ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి సినిమా చేయడం చాలా కష్టం. మా డైరెక్టర్ అక్కడే ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకో మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఇది చిన్న సినిమా కాదు.. కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ఫ్రెండ్స్‌తో చూడాల్సిన సినిమా ఇది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని అన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 06:52 PM