Natti Kumar: జగన్‌కు రాయి దెబ్బ.. సెక్యూరిటీ ఏం చేస్తుంది? పక్కా ప్లాన్ తోనే..

ABN , Publish Date - Apr 16 , 2024 | 05:47 PM

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (జగన్ మోహన్ రెడ్డి కి AP CM)దెబ్బ తగలడం భద్రత లోపం అని అన్నారు నిర్మాత నట్టి కుమార్‌ (Producer nattikumar). అంతకు కొద్దిరోజుల ముందు జరిగిన మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ సభల్లో లా అండ్‌ ఆర్డర్‌ లోపం కనిపించింది అని ఆయన విమర్శించారు.

Natti Kumar: జగన్‌కు రాయి దెబ్బ.. సెక్యూరిటీ ఏం చేస్తుంది? పక్కా ప్లాన్ తోనే..
Natti Kumar Pressmeet on YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి‌ (AP CM Jagan Mohan Reddy)కి దెబ్బ తగలడం భద్రత లోపం అని అన్నారు నిర్మాత నట్టి కుమార్‌ (Producer Natti Kumar). అంతకు కొద్దిరోజుల ముందు జరిగిన మోదీ (Narendra Modi), చంద్రబాబు (Chandrababu Naidu), పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) సభల్లో లా అండ్‌ ఆర్డర్‌ లోపం కనిపించింది అని ఆయన విమర్శించారు. ఈ మేరకు నట్టి కుమార్‌ మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

*Naveen Yerneni: కిడ్నాప్‌తోపాటు మరో కేసులో నిర్మాత నవీన యెర్నేని


ఆయన మాట్లాడుతూ.. పెన్షన్‌ల విషయంలోనూ సి.ఎస్‌ చాలామందిని ఇబ్బందులకు గురిచేశారు. వీటన్నింటిని ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి లెటర్‌ రూపంలో తీసుకెళ్లాను. కేంద్ర బలగాల సహాయంతో ఈసారి పోలింగ్‌ చేయాలని కోరటం జరిగింది. గతంలో జగన్ పై జరిగిన కోడి కత్తి విషయం ఇంతవరకు తేలలేదు. ఆ దాడి వెనకున్న కారణాలేంటనేది బయటకు రాలేదు. వై.ఎస్‌. వివేకా గారి హత్య వెనుక కారణాలు బయటకు రాలేదు. వివేకా మర్డర్‌ గురించి జగన్‌కు అన్నీ తెలుసు. వైఎస్‌.సునీత, వై.ఎస్‌ షర్మిల ప్రశ్నలకు జగన్‌ దగ్గర సమాధానాలు లేవు. విమలమ్మ వన్‌ సైడెడ్‌గా మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుండగానే జగన్‌కు రాయి తగిలింది. ఆ రాయి దెబ్బ వెల్లంపల్లికి కూడా తగిలిందని ఓ కన్ను మూసేశారు. నిజంగా రాయి తగిలితే.. గట్టి దెబ్బె తగిలేది. సీఎం సభ అంటే 1000 మీటర్ల మేర జగన్‌ కోసం సెక్యూరిటీ ఆధీనంలో ఉంటుంది. అసలు ఆ సెక్యూరిటీ అంతా ఏమైంది? ఇది ఆకతాయిల పని కాదు. జగన్‌కు దెబ్బ తగలగానే, సోషల్‌ మీడియాల్లో, కొన్ని చానెల్స్‌లో గగ్గోలు పెట్టిన బైట్స్‌, వీడియోలు ఎలా వచ్చాయి. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇదంతా ప్రతిపక్షం మీద నెపం వేయడానికి అని అర్థమవుతోంది. ఎలక్షన్‌ కమిషన్‌ దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి. అసలు విషయాలు బయటకు రావాలి. కేంద్ర బలగాలతో సీఎం నుంచి సామాన్య వరకు సెక్యూరిటీ అందించాలని అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఓటరు స్వచ్ఛందంగా ఓటు వేయాలంటే సెంట్రల్‌ బలగాలతో ఏపీలో ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉంది. జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ  ఉన్న సిఎంకు ఇలా జరిగితే, సామాన్యుల పరిస్దితి ఏంటి? కోడికత్తి దాడి, వివేకా హత్య, జగన్‌ రాయి దాడిని పరిగణలోకి తీసుకుని ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు చేపట్టాలి. షర్మిల, సునీతలకు సెక్యూరిటీ పెంచాలి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నవీన్‌ యెర్నేని పేరు ఓ కేసులో వినిపించింది. ఆయనపై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఛాంబర్‌ స్పందించలేదు. ప్రతిసారి ఇండస్ట్రీ పేరు ఎందుకు వస్తుంది. మరలా క్లీన్‌ చీట్‌ ఎందుకు ఇస్తున్నారు. ఇండస్ట్రీ పరువు తీసిన పోలీసులపై ఎందుకు యాక్షన్‌ తీసుకోలేదు. ప్రభుత్వం, పోలీసులు సినిమా ఇండస్ట్రీ టార్గెట్‌ చేస్తుంటే, సినీ పెద్దలు ఖండించటం లేదు. తప్పుడు అభియోగాలను ఇండస్ట్రీ సీరియస్‌గా తీసుకోవాలి. డ్రగ్స్‌ విషయంలో ఎవర్ని సహించేది లేదు. నిందితులకు శిక్ష పడాల్సిందే. అలాగే తప్పు చేసిన పోలీసులకు కూడా, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో శిక్షణ పడాలి. సినిమా వారిపై దయచేసి అభండాలు వేయటం కరెక్ట్‌ కాదు. నవీన్‌ వందలకోట్లతో సినిమాలు చేస్తున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఎంతో తెలియాలి" అని నట్టి కుమార్ (Natti Kumar) అన్నారు. 

Updated Date - Apr 16 , 2024 | 06:06 PM