Ritu Varma: ఈ 'పెళ్లిచూపులు' భామ అందచందాలు చూసి తీరాల్సిందే!

ABN , Publish Date - Apr 29 , 2024 | 02:03 PM

కెరీర్ మొదట్లోనే 'పెళ్లి చూపులు' సినిమాతో నంది అవార్డు గెలుచుకున్న నటి రీతు వర్మ. తరువాత వరసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. విక్రమ్ కథానాయకుడు. ఇది కాకుండా ఇంకా తెలుగు, తమిళంలో బిజీగా వున్న నటీమణుల్లో రీతు వర్మ ఒకరు.

Ritu Varma: ఈ 'పెళ్లిచూపులు' భామ అందచందాలు చూసి తీరాల్సిందే!
Ritu Varma

తెలుగు నటీమణుల్లో మంచి ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న నటీమణుల్లో రీతు వర్మ ఒకరు. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి తన కెరీర్ మొదట్లోనే ఉత్తమ నటిగా నంది అవార్డు తీసుకున్నారు అంటే, ఆమె ఎంత ప్రతిభావంతురాలో అర్థం అవుతుంది. మొదట్లో లఘు చిత్రాల్లో నటించి, తరువాత 'ప్రేమ ఇష్క్ కాదల్' అనే సినిమాతో కథానాయకురాలిగా ఎంట్రీ ఇచ్చారు రీతు వర్మ.

rituvarmanew.jpg

అయితే ఆమెకి పేరు తెచ్చిన చిత్రం మాత్రం 'ఎవడె సుబ్రహ్మణ్యం' అని చెప్పాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని కథానాయకుడు, విజయ్ దేవరకొండ ఇంకో ప్రధాన పాత్రలో కనపడతాడు. ఈ సినిమా రీతు వర్మకి మంచి పేరు తెచ్చి పెట్టింది. తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంలో రీతు వర్మ కథానాయికగా నటించి అందరి ప్రశంశలు పొందటమే కాకుండా, ఆ సినిమాలో ఆమె నటనకి నంది అవార్డు కూడా వచ్చింది.

rituvarmanewone.jpg

విజయ్ దేవరకొండ కూడా అదే సినిమాతో మంచి పేరు సంపాదించాడు. ఇక ఈ 'పెళ్లి చూపులు' సినిమాతో రీతు వర్మ వెనక్కి తిరిగి చూడలేదు. తనదైన శైలిలో తనకి నచ్చిన చిత్రాలు చేసుకుంటూ మంచి పేరు సంపాదించింది. ఆ తరువాత తమిళంలో కూడా తన ప్రతిభ చాటాలనుకొని అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసింది రీతు వర్మ. దుల్కర్ సల్మాన్ తో చేసిన తమిళ సినిమా తెలుగులో 'కనులు కనులు దోచాయ్' అనే అనువాద సినిమాగా విడుదలైంది. ఈ సినిమా కూడా రీతు వర్మ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

rituvarmanewtwo.jpg

ఇలా వరసగా తనకి నచ్చిన పాత్రలు మాత్రమే చేసుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న రీతు వర్మ ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్నా 'ధ్రువ నక్షత్రం' సినిమా విడుదలకి ఎదురుచూస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో పని చెయ్యాలని చాలామంది అనుకుంటూ వుంటారు, అలాంటిది రీతు వర్మకి అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమా కొంచెం ఆర్ధిక ఇబ్బందుల వలన విడుదలలో జాప్యం జరుగుతోంది అని అంటున్నారు, ఈ సినిమా విడుదల కోసం రీతు వర్మ ఎదురుచూస్తోంది.

rituvarmaglam.jpg

అలాగే తెలుగులో 'స్వాగ్' అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇంకో యువ నటుడి పక్కన కూడా ఒక సినిమా ఒప్పుకునే అవకాశం వుంది అని అంటున్నారు. ఆ కథ రీతు వర్మ వినింది, కానీ ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు అని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ తన అభిమానులతో కూడా టచ్ లో ఉంటూ ఉంటుంది రీతు వర్మ.

Updated Date - Apr 29 , 2024 | 02:03 PM