SSMB29: పురాణాల స్ఫూర్తితో మహేశ్ బాబు పాత్ర

ABN , First Publish Date - 2023-04-12T15:35:56+05:30 IST

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) తన తర్వాతి సినిమాను మహేశ్ బాబు (Mahesh Babu)తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’ (SSMB29) అని వ్యవహరిస్తున్నారు.

SSMB29: పురాణాల స్ఫూర్తితో మహేశ్ బాబు పాత్ర

టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తర్వాతి సినిమాను మహేశ్ బాబు (Mahesh Babu)తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’ (SSMB29) అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతుంది. పాన్ ఇండియాగా రూపొందుతుంది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..

రాజమౌళి గత చిత్రాల్లోని పాత్రలను రామాయణం, మహాభారతాల స్ఫూర్తితోనే రాశారు. అదే బాటను కొనసాగిస్తూ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌29’ స్టోరీని రాస్తున్నారట. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌29’ లో మహేశ్ బాబు పాత్రను లార్డ్ హనుమాన్ స్ఫూర్తితో రాస్తున్నారని సమచారం అందుతుంది. అడవిలో చోటు చేసుకున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆంజనేయుడికి ఉంది. అందువల్లే హనుమాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని మహేశ్ పాత్రను రాస్తున్నారట. జక్కన్న ఈ పాత్రకు తనదైన మార్కును యాడ్ చేస్తారని ఫిల్మ్ నగర్‌లో వదంతులు షికార్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిఫ్ట్ వర్క్ జరుగుతుంది. ఈ ఏడాది చివరలో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. సినిమా షూటింగ్‌ను అధిక భాగం అమెజాన్ అడవుల్లో జరుపుతారని సమాచారం అందుతుంది. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌29’ తెరకెక్కనుంది.

SSMB29.jpg

రేసులో ఇంటర్నేషనల్ స్టూడియోలు:

‘ఆర్ఆర్ఆర్’ అనంతరం రాజమౌళికి వరల్డ్ వైడ్‌గా మంచి మార్కెట్ ఏర్పడింది. అందువల్ల పలు ఇంటర్నేషనల్ స్టూడియోస్ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’ ను నిర్మించడానికి పోటీపడుతున్నాయి. డిస్నీ ఇండియా, సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి. సినిమాకు ప్రపంచస్థాయి టెక్నిషీయన్స్‌ను అందిస్తామని చెబుతున్నాయి. రాజమౌళి గత సినిమాల మాదిరిగానే ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ‌29’ లో భారీ‌ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ వీఎఫ్‌ఎక్స్‌ను లాస్ ఏంజెలెస్‌లో చేయాలని నిర్ణయించుకున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

Aadujeevitham: ఈ సినిమా కోసం చిరంజీవికి నో చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ట్రైలర్‌‌ను వీక్షించారా..?

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Updated Date - 2023-04-12T15:42:56+05:30 IST