Mahesh Babu: ఆ పాత్రలో మహేష్‌ను చూస్తే మైమరచిపోవలసిందే!

ABN , Publish Date - Mar 07 , 2024 | 03:33 PM

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే! 'ఎస్‌ఎస్‌ఎంబీ29' వర్కింగ్‌ టైటిల్‌తో త్వరలో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

Mahesh Babu: ఆ పాత్రలో మహేష్‌ను చూస్తే మైమరచిపోవలసిందే!

మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే! 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) వర్కింగ్‌ టైటిల్‌తో త్వరలో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే నిర్మాణ సంస్థ నుంచి గానీ, హీరో, దర్శకుల నుంచి గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే తాజాగా హీరో మహేష్‌బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళితో చేయబోయే చిత్రం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాననీ, సెట్‌లో అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. (Mahesh as lord Krishna)


Krishna-mahesh.jpg
ఇటీవల రాజమౌళి మహేష్‌తో ఎనిమిది లుక్స్‌తో ఫొటో షూట్‌ నిర్వహించారని రెండ్రోజులు క్రితం ఓ వార్త హల్‌చల్‌ చేసింది. అయితే తాజాగా ఆ చిత్ర బృందం, రాజమౌళి టీమ్‌కి అత్యంత సన్నిహితమైన వ్యక్తుల ద్వారా ఓ వార్త బయటకొచ్చింది. ఇటీవల మహేష్‌ను కృష్ణుడి గెటప్‌లో ఫొటో షూట్‌ చేశారట. కొన్ని గంటలపాటు ఈ షూట్‌ జరిగిందట. అయితే కృష్ణుడిగా  మహేష్ లుక్ అయితే మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా కుదిరిందట. ప్రస్తుతానికి ఆ లుక్‌  బయటకు రాలేదు కానీ కృష్ణుడి గెటప్‌లో మహేష్‌ను చూసి టీమ్‌ అంతా మురిసిపోయారట.  తాజాగా చేసిన ఎనిమిది గెటప్‌ల షూట్‌లో కృష్ణుడి గెటప్‌ కూడా ఒకటని తెలిసింది. మరి టీమంతా మెచ్చిన ఆ లుక్‌నే రాజమౌళి ఫైనల్‌ చేస్తారా? ఇంకా కొత్తగా ఏమన్నా ఆలోచిస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం రాజమౌళి తన టీమ్‌ 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్ , స్కెచ్, లుక్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారట. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్‌ అంటే సెట్స్‌ మీదకెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారో చూడాలి. అమెజాన్  అడవుల నేపథ్యంలో యాక్షన్  థ్రిల్లర్‌ చిత్రమిదని మొదటి నుంచి ప్రచారంలో ఉంది. ఈ తరహా కథ కోసం రాజమౌళి కృష్ణుడి గెటప్‌లో షూట్‌ ఎందుకు చేశారన్నది తెలియాల్సి ఉంది. 

Rajamouli.jpg#urstrulyMahesh

Updated Date - Mar 07 , 2024 | 03:59 PM