Ritu Varma: వ‌ర్త్ వర్మ.. వర్త్ ! రీతూ వర్మ పెడుతుందయ్యా ఎర్త్

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:28 PM

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌నానుడి మ‌న హైద‌రాబాదీ రీతూవ‌ర్మ (Ritu Varma) కు అచ్చు గుద్దినట్లు స‌రిపోతుంది. అందం, న‌ట‌న, గ్లామ‌ర్‌ ఉన్నప్ప‌టికీ ఎందుక‌నో స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను దక్కించుకోలేక పోతున్న‌ది.

Ritu Varma: వ‌ర్త్ వర్మ.. వర్త్ ! రీతూ వర్మ పెడుతుందయ్యా ఎర్త్
RITU VARMA

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌నానుడి మ‌న హైద‌రాబాదీ రీతూవ‌ర్మ (Ritu Varma) కు అచ్చు గుద్దినట్లు స‌రిపోతుంది. అందం, న‌ట‌న, గ్లామ‌ర్‌ ఉన్నప్ప‌టికీ ఎందుక‌నో స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను దక్కించుకోలేక పోతున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో ఎక్కువగా విజ‌యాలే ఉన్నప్పటికీ ఈ సుంద‌రికి అదృష్టం అంత‌గా క‌లిసి రావ‌డం లేదు ఓ అడుగు ముందుకేస్తే రెండ‌డుగులు వెన‌క‌కు అన్న చందంగా ప‌రిస్థితి ఉంది. తెలుగులో రెండేండ్ల క్రితం చేసిన ఒకే ఒక జీవితం సినిమా త‌ర్వాత మ‌రో స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో క‌నిపించ‌లేదు.

ritu varm.jpg

తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రీతూవ‌ర్మ (Ritu Varma) మలయాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్ తో కలిసి చేసిన కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యదితాల్ (క‌నులు క‌నులు క‌లిశాయంటే), విశాల్‌తో ఈ మ‌ధ్య‌ చేసిన‌ మార్క్ అంటోనీ మంచి విజ‌యాన్ని సాధించిన‌ప్ప‌టికీ అమ్మ‌డి కెరీర్ మాత్రం ప్రస్తుతం తెలుగునాట వస్తున్న హీరోయిన్స్‌కు స‌మానంగా స్పీడు అందుకోవ‌డం లేదు. గ‌తంలో గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి కూడా సిద్ధ‌మే అని ముద్దుగుమ్మ‌ చెప్పిన‌ప్ప‌టికీ సినిమా అవ‌కాశాలు మాత్రం పొంద‌లేక‌పోతున్న‌ది.


ritu varmaa.jpg

సినిమాల్లో నిండైనా చీర‌క‌ట్టులో అచ్చ తెలుగ‌మ్మాయిగా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమానులను సంపాధించుకున్న రీతూవ‌ర్మ (Ritu Varma) సోష‌ల్ మీడియాలో మాత్రం అందుకు విరుద్ధంగా నేనెవరికీ తక్కువ కాదు అనేలా హాట్‌ హాట్ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్ర‌కారును నిద్ర‌కు దూరం చేస్తున్న‌ది. తాజాగా విడుదల చేసిన ఫొటోలు కూడా ఓ రేంజ్ లో ఉండడంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

rituu.jpg

రీతూవ‌ర్మ (Ritu Varma) ప్ర‌స్తుతం చియాన్ విక్ర‌మ్(Chiyaan Vikram ) వంటి స్టార్ హీరో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి పెద్ద దర్శకుడితో చేసిన ధృవ‌న‌క్ష‌త్రం (Dhruva Natchathiram) సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అదీ కూడా అప్పుడెప్పుడో 2017లో ప్రారంభమైన ఈ సినిమా విడుదల కావడానికి కూడా అపసోపాలు పడుతూ అసలు రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ అమ్మ‌డు పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ కళ్లలయ్యేలా ఉన్నాయి.

Updated Date - Feb 29 , 2024 | 07:03 PM