Pushpa 2 The Rule: ‘పుష్ప పుష్ప’ జస్ట్ ప్రోమోనే వచ్చింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:40 PM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌-2 ది రూల్’. ‘పుష్ప ది రైజ్‌’తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా.. నేషనల్ అవార్డ్‌ని సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడందరి చూపు ‘పుష్ప’కు సీక్వెల్‌గా రాబోతోన్న ‘పుష్ప 2 ది రూల్’ పైనే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. తాజాగా ఈ సీక్వెల్ ఫస్ట్ పాటకు సంబంధించిన ప్రోమోని మేకర్స్ వదిలారు.

Pushpa 2 The Rule: ‘పుష్ప పుష్ప’ జస్ట్ ప్రోమోనే వచ్చింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
Pushpa 2 the Rule Movie Still

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌-2 ది రూల్’ (Pushpa2 The Rule). ‘పుష్ప ది రైజ్‌’ (Pushpa The Rise)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా.. నేషనల్ అవార్డ్‌ని సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Director Sukumar) ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. ఇప్పుడందరి చూపు ‘పుష్ప’ (Pushpa)కు సీక్వెల్‌గా రాబోతోన్న ‘పుష్ప 2 ది రూల్’ పైనే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

*Allu Arjun: ప్రతి సన్నివేశ చిత్రీకరణ ముందు రిహార్సల్, అందుకే పుష్పకి అంత పేరు


ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న ‘పుష్ప‌ 2: ది రూల్’కు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ వచ్చినా సంచలనంగా మారుతోంది. ఇటీవల ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వదిలిన టీజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగా... ఇప్పుడు చిత్రయూనిట్ మ్యూజిక్‌ ప్రమోషన్స్‌తో పుష్పరాజ్‌ను మరింతగా ప్రేక్షకుల దగ్గరకు చేర్చబోతున్నారు. ఇక తాజాగా ‘పుష్ప 2: ది రూల్‌’ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్‌ (Devi Sri Prasad) సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర పాటల్లోంచి మొదటి లిరికల్‌ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. దీనికి సంబంధించిన 20 సెకండ్ల ప్రోమోను (Pushpa Pushpa Song Promo) బుధవారం మేకర్స్ విడుదల చేశారు.


Pushpa.jpg

‘పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌..’ అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఈ ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ‘పుష్ప’ విజయానికి దేవిశ్రీ సంగీతం, ఆయన స్వరపరిచిన పాటలు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌తో మరోసారి దేవి తన సత్తా చాటబోతున్నాడనేది ఈ ప్రోమోతో తెలిసిపోతుంది. కాగా.. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా విడుదల (Pushpa 2 The Rule Release Date) చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Read Latest Cinema News

Updated Date - Apr 24 , 2024 | 04:40 PM