Pushpa2: అల్లు అర్జున్ సినిమా ఆడియో రికార్డు బ్రేక్ చేసింది

ABN , First Publish Date - 2023-05-08T10:22:07+05:30 IST

అల్లు అర్జున్ భారత దేశం లో వున్న నటుల్లో అగ్రస్థానం లో వున్నాడు. ఎందులో అంటే, ఆడియో హక్కులు విషయంలో. అతను, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' ఆడియో హక్కులు ఇంతకీ అమ్మారో తెలుసా... దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు దీనికి.

Pushpa2: అల్లు అర్జున్ సినిమా ఆడియో రికార్డు బ్రేక్ చేసింది

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' (Pushpa 2) సినిమా కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మీద క్రేజ్ చాలా వుంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు, అలాగే ఓటిటి, శాటిలైట్ హక్కులకు కూడా చాలా డిమాండ్ వుంది. ఏ సినిమాకి కూడా ఇంత డిమాండ్ లేదు, ఆలా వుంది ఈ 'పుష్ప 2' కోసం. ఇప్పుడు తాజాగా వినపడుతున్న వార్త ఏంటంటే ఈ సినిమా ఆడియో హక్కుల (Pushpa 2 audio) కోసం డిమాండ్ పడుతున్నారని. ఎందుకంటే ఈ సినిమా పార్టు వన్ 'పుష్ప' (Pushpa) పాటలు ఈరోజుకి ఇంకా ప్రపంచం అంతా మారుమోగుతున్నాయి. కోట్ల మంది ప్రేక్షకులు ఆ పాటలను విన్నారు, వింటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

pushpa2alluarjun.jpg

అందువల్ల ఇప్పుడు 'పుష్ప 2' పాటల కోసం బాగా డిమాండ్ వచ్చింది. హిందీ మార్కెట్ లో మంచి సత్తా వున్న టి సిరీస్ (T-Series) వాళ్ళు ఈ ఆడియో హక్కులని చేజిక్కించుకుంటున్నారు అని తెలిసింది. ఇంతకీ ఎంత అమౌంట్ కి తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు సుమా ! రూ.65 కోట్లు చెల్లించారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది భారత దేశం లో ఏ యాక్టర్ కి ఇంత పెద్ద డిమాండ్ లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ 'పుష్ప 2' సినిమాతో ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఇందులో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ లు చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి, ప్రత్యేకంగా ఆ ఐటెం సాంగ్స్.

pushpa2sukumar.jpg

అదే కాకుండా అల్లు అర్జున్ ముందు సినిమాలు, 'ఆల వైకుంఠ పురం లో' (Ala Vaikuntapuramlo) సినిమా యూట్యూబ్ లో 3 బిలియన్ వ్యూయర్స్ చూస్తే, 'పుష్ప' సినిమా 5 బిలియన్ వ్యూయర్స్ చూసారు. దీన్ని బట్టే అర్థం అవుతోంది అతని సినిమా ఆడియో కి ఎంత డిమాండ్ వుంది అన్న విషయం.

Updated Date - 2023-05-08T10:22:07+05:30 IST