Pushpa2: అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ ఫొటో లీక్.. సుకుమార్ ఫైర్

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:19 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేసిందో.. జనాలంతా చూశారు. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డును తెచ్చి పెట్టిన చిత్రమిది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ‘పుష్ప2’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుండి ఓ ఫొటో లీకైంది. ఈ లీక్‌తో యూనిట్‌పై సుకుమార్ సీరియస్ అయ్యారనేలా వార్తలు వినిపిస్తున్నాయి.

Pushpa2: అమ్మవారి గెటప్‌లో అల్లు అర్జున్ ఫొటో లీక్.. సుకుమార్ ఫైర్
Allu Arjun In Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ (Pushpa) సినిమా ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేసిందో.. జనాలంతా చూశారు. అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డును తెచ్చి పెట్టిన చిత్రమిది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ‘పుష్ప2’ (Pushpa 2) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule) పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై భారీ అంటే భారీగా అంచనాలున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఆ అంచనాలను అందుకునేందుకు ఎంతగానో కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి ఓ ఫొటో లీక్ అయింది. ఈ లీక్‌తో యూనిట్‌పై సుకుమార్ ఫైర్ అయినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

‘పుష్ప ది రూల్’లో అందరినీ సర్‌ప్రైజ్ చేసేలా.. గంగమ్మ జాతర ఎపిసోడ్‌ని సుకుమార్ ప్లాన్ చేసినట్లుగా ఇప్పటికే అఫీషియల్‌గా ఓ పోస్టర్ వదిలారు. ఈ జాతర బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల్లో అల్లు అర్జున్ అమ్మవారిలా కనిపించనున్నాడనేలా అధికారికంగా విడుదలైన పోస్టర్‌తో అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం ఈ జాతరకు సంబంధించి షూట్ చేస్తున్న సీన్స్ నుండి ఓ ఫొటో లీక్ కావడంతో టీమ్ అంతా అలెర్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ గంగమ్మ జాతర షూట్ నుండి ఫొటో ఎలా లీక్ అయిందా? అని టీమ్‌పై సుకుమార్ సీరియస్ అయ్యాడట. ఇప్పుడిదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Snap Leaked From Pushpa 2)


Bunny.jpg

ఈ లీకైన ఫొటో విషయంలో నిర్మాతలు కూడా డిజప్పాయింట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందా? అని దర్శకనిర్మాతలు యూనిట్‌ను ఆరా తీస్తున్నారట. గతంలో కూడా ఇలాగే కొన్ని లీక్స్ వస్తే.. చిత్రయూనిట్ వెంటనే అలెర్ట్ అయింది. ఇప్పుడు మళ్లీ అది పునరావృతం అవుతుండటంతో.. యూనిట్‌కు సుకుమార్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారనేలా టాక్ వినబడుతోంది. ఇక లీకైన ఫొటోలో అల్లు అర్జున్ చీరలో కనిపిస్తున్నారు. ఈ లీక్డ్ ఫొటో సోషల్ మీడియాని షేకాడిస్తోంది. పుష్పాగాడి జాతర చూడాలంటే ఇంకా రెండు వందల రోజులు వెయిట్ చేయాలంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

====================

*Santhanam: నొప్పించడానికి కాదు.. నవ్వించేందుకే సినిమాల్లోకి వచ్చా

************************

*Raveena Tandon: ఆ వదంతులకు తావు లేదు.. ఇప్పుడే చాలా బావుంది

***************************

Updated Date - Jan 30 , 2024 | 03:19 PM