Pushpa2 The Rule: పుష్ప ది రూల్.. ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది! అంతా సిద్ధంగా ఉండండి

ABN , Publish Date - Apr 24 , 2024 | 06:15 AM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ఫ 2 ది రూల్. తాజాగా చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ఫ్లాన్ చేశారు.

Pushpa2 The Rule:  పుష్ప ది రూల్.. ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేస్తోంది! అంతా సిద్ధంగా ఉండండి
pushpa

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ఫ 2 ది రూల్. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) , దేవీ శ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన గ్లిమ్స్‌, టీజ‌ర్‌లు జ‌నాల్లోకి చొచ్చుకెళ్ల‌గా సినిమా విడుద‌ల కోసం ప్రేక్ష‌కులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అంతేగాక ఈ ముగ్గురి కల‌యిక‌లో వ‌చ్చే పాట‌ల‌పై కూడా స‌ర్వ‌త్రా చాలా అంచ‌నాలుంటాయి.ఈ క్ర‌మంలో చాలారోజుల నుంచి అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్ర‌సాద్ అభిమానులు వెయిటింగ్ చేస్తున్న‌ రోజు రానే వ‌చ్చింది. చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ఫ్లాన్ చేశారు.

dsp.jpeg

ఈ సినిమా నుంచి మొద‌టి పాట విడుద‌ల తేదీకి సంబంధించిన ప్రోమోను ఈ రోజు (బుధ‌వారం) సాయంత్రం 4.05 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) త‌మ సోష‌ల్ మీడియా ఫ్లాట్ పాం ఎక్స్ నుంచి అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar), దేవీ శ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) ఈ ముగ్గురి కాంబినేష‌న్‌లో సినిమా కావ‌డంతో సంగీతంపై అంత‌కుమించి అనే స్థాయిలో అంచ‌నాలు ఉంటాయి.


పుష్ఫ 1 పాట‌లు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఓ దుమ్ముదుల‌ప‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఇప్పుడు పుష్ఫ‌2 పాట‌ల‌పై ప‌డింది. కాగా ఈచిత్రం అడియో హ‌క్కుల‌ను అన్ని భాషల్లో బాలీవుడ్ దిగ్గ‌జ కంపెనీ భూషణ్‌ కుమార్‌ టీ సిరీస్ భారీ మొత్తం చెల్లించి దక్కించుకోవ‌డం విశేషం. ఇటీవలే అల్లు అర్జున్ (Allu Arjun) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌ యూట్యూబ్‌లో 150 వాచింగ్ హవర్స్‌తో 115 మిలియన్‌ వ్యూస్‌, 1.6 మిలియన్‌ లైక్స్‌, 55వేల‌కు పైచిలుకు కామెంట్స్‌తో సోషల్ మీడియాలో నంబర్ 1గా టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచి.. స‌రికొత్త రికార్డును సృష్టించింది. ఇదిలాఉండ‌గా ఈ పుష్ప.. ది రూల్‌ (Pushpa 2 The Rule)ఆగ‌స్టు 15న ప్రపంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

Updated Date - Apr 24 , 2024 | 06:15 AM