scorecardresearch

Bharateeyudu 2: సిద్ధార్థ్, రకుల్‌ల ప్రేమ పాట ‘చెంగల్వ చేయందేనా..’ వచ్చేసింది

ABN , Publish Date - May 29 , 2024 | 10:00 PM

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రం నుండి లవ్ మెలోడీ సాంగ్ ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

Bharateeyudu 2: సిద్ధార్థ్, రకుల్‌ల ప్రేమ పాట ‘చెంగల్వ చేయందేనా..’ వచ్చేసింది
Bharateeyudu 2 Movie Still

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Director Shankar) కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ (RedGiant Movies) బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’ (Bharateeyudu 2). ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి లవ్ మెలోడీ సాంగ్ ‘చెంగల్వ చేయందేనా..’ (Chengaluva Song) అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.

*Kiraak RP: అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడంటూ వేణు స్వామిపై కిరాక్ ఆర్పీ ఫైర్..

1996లో క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ‘భార‌తీయుడు 2’ చిత్రం రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తోన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ‘ఇండియ‌న్ 2’ ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘శౌర..’ అనే పాట సూపర్బ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. తాజాగా వదిలిన ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాట కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఇందులో సిద్ధార్థ్ (Siddharth), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కెమిస్ట్రీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ పాటకు అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాట‌ను అబ్బి, శ్రుతికా స‌ముద్రాల పాడారు.


Rakul-Preet-Singh.jpg

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. (Chengaluva Song From Bharateeyudu 2 Out)

Read Latest Cinema News

Updated Date - May 29 , 2024 | 10:00 PM