Bharateeyudu2: అఫీషియల్.. డేట్ చెప్పలేదు కానీ.. ‘భారతీయుడు 2’ విడుదల ఎప్పుడో చెప్పారు

ABN , Publish Date - Apr 06 , 2024 | 06:41 PM

శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘భారతీయుడు 2’. కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను జూన్‌లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్‌. ఇందులో కమల్‌తో పాటు కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, సముద్రగని, బాబీ సింహా వంటి పలువురు నటించారు.

Bharateeyudu2: అఫీషియల్.. డేట్ చెప్పలేదు కానీ.. ‘భారతీయుడు 2’ విడుదల ఎప్పుడో చెప్పారు
Bharateeyudu2 Movie Poster

శంకర్‌ (Shankar) దర్శకత్వంలో కమలహాసన్‌ (Kamal Haasan) నటిస్తున్న తాజా చిత్రం ‘భారతీయుడు2’ (Bharateeyudu2). కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించలేదు కానీ.. విడుదల ఎప్పుడో మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలియజేసింది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ (Bharateeyudu)కి ఇది సీక్వెల్‌.

*Ram Gopal Varma: ఇక నా సినిమాలు నేను చేసుకుంటా... వాటి జోలికి వెళ్ళను 


ఇందులో కమల్‌తో పాటు కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), సిద్ధార్థ్‌ (Siddharth), సముద్రగని, బాబీ సింహా వంటి పలువురు నటించారు. ఈ మూవీ తొలి భాగానికి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (AR Rahman) సంగీతం అందించగా, రెండో భాగానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ (Anirudh Ravichander) సంగీత స్వరాలు సమకూర్చారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని తుది దశ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో జూన్‌లో విడుదల చేయనున్నారు. (Ulaganayagan Kamal Haasan Starring Bharateeyudu2 Box Office Attack in June)


Kamal-Haasan.jpg

వాస్తవానికి ముందుగానే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, తమిళనాడు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు.. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో మే లో రెండో దశ పోలింగ్‌‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని జూన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జూన్‌లో ఏ తేదీన ఈ సినిమా విడుదల అవుతుందనేది మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ (Red Giant Movies)తో కలిసి లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions)పై సుభాస్క‌ర‌న్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్ ‘కరెప్షన్’ అనే కాన్సెప్ట్‌పై వస్తే.. ఈ పార్ట్‌ ‘జీరో టాలరెన్స్’ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లుగా టైటిల్‌ పోస్టర్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. తెల్ల‌టి ధోతి, కుర్తాలో క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) క‌నిపిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం అంటే ఎంత స్వ‌చ్చంగా ఉండాలో అంత‌టి స్వ‌చ్చ‌త పోస్ట‌ర్‌ (Bharateeyudu2 Poster)ను ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది. జీరో టాల‌రెన్స్ (త‌ప్పును అస్స‌లు భ‌రించ‌లేను) అని పోస్ట‌ర్‌పై ఉన్న లైన్ చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంది. ఇక క‌మ‌ల్ హాస‌న్ కూడా సీరియ‌స్‌, ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. అలాగే మ‌నదేశాన్ని అవినీతి క్యాన్స‌ర్‌లా ప‌ట్టి పీడిస్తోంది. ఈ విష‌యాన్ని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఈ పోస్ట‌ర్‌తో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ధూమ‌పానానికి వ్య‌తిరేకంగా చేసిన ప్ర‌క‌ట‌న‌ల నుంచి ప్రేర‌ణ‌తో ఈ పోస్ట‌ర్‌ను త‌యారు చేశారు. ఇది సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

Updated Date - Apr 06 , 2024 | 06:50 PM