Kiraak RP: అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడంటూ వేణు స్వామిపై కిరాక్ ఆర్పీ ఫైర్..

ABN , Publish Date - May 29 , 2024 | 04:01 PM

ఈ మధ్య వేణు స్వామి ఎలా వార్తలలో ఉంటున్నారో తెలియంది కాదు. ట్రెండింగ్‌లో ఏ విషయం ఉంటే ఆ విషయంపై తనదైన శైలిలో ఏదేదో చెప్పేస్తూ.. ఇదే నా మాట.. నా మాటే శాసనం అన్నట్లుగా జాతకాలు చెబుతున్న వేణు స్వామిపై తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించిన కిరాక్ ఆర్పీ వేణు స్వామిపై, వైఎస్ఆర్‌సీపీపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

Kiraak RP: అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడంటూ వేణు స్వామిపై కిరాక్ ఆర్పీ ఫైర్..

ఈ మధ్య వేణు స్వామి (Venu Swamy) ఎలా వార్తలలో ఉంటున్నారో తెలియంది కాదు. ట్రెండింగ్‌లో ఏ విషయం ఉంటే ఆ విషయంపై తనదైన శైలిలో ఏదేదో చెప్పేస్తూ.. ఇదే నా మాట.. నా మాటే శాసనం అన్నట్లుగా జాతకాలు చెబుతున్న వేణు స్వామి.. రీసెంట్‌గా జరిగిన ఏపీ ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీ (YSRCP) పార్టీ గెలిచి, మళ్లీ జగన్ సీఎం (YS Jagan) అవుతాడంటూ, ఆయన జాతకం అలా ఉందని చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. అలాగే జగన్‌తో కలిసి వేణు స్వామి ప్రయాణం చేస్తున్న వీడియో కూడా సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. వీటన్నింటిపై తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్పీ (Jabardasth Kiraak RP) ఫైర్ అయ్యారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించిన కిరాక్ ఆర్పీ వేణు స్వామిపై, వైఎస్ఆర్‌సీపీపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

*Mega Star Chiranjeevi: ‘విశ్వంభర’ సెట్స్ కి అనుకోని అతిధి వచ్చి ఆశ్చర్యపరిచారు


వేణు స్వామిని ఉద్దేశిస్తూ.. (Jabardasth Kiraak RP Comments on Venu Swamy) ‘‘జగన్ సంకనాకుతూ.. జగన్ గెలుస్తాడంటూ మాట్లాడుతున్నాడు. మరీ వేణు స్వామి గతంలో చెప్పినట్లు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు.. కేటిఆర్ సీఎం ఎందుకు కాలేదు. అలాగే ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలుస్తుందన్నాడు. అతని మాటలను నమ్మి బెట్టింగ్‌లు కట్టిన పిల్లకాయలు నిండా మునిగిపోయారు. మెగా ఫ్యామిలీ‌ని కూడా టార్గెట్ చేసి వరుణ్, లావణ్య విడిపోతారని అంటున్నాడు. చంద్రబాబుగారు (Chandrababu Naidu), లోకేష్‌బాబు (Nara Lokesh), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారి‌పై కావాలనే తప్పుడు జాతక ప్రచారాలు చేశాడు.. చేస్తున్నాడు. ఆ మధ్య ఇక ప్రభాస్ హిట్ రాదని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే.. జగన్ (Jagan), సజ్జల భార్గవ్ రెడ్డి (Sajjala Bhargava Reddy) కావాలని చేయిస్తున్న దుష్ర్పచారం ఇది.


Kiraak-RP.jpg

నేను వేణు స్వామిని ఒక్కటే అడుగుతున్నా.. అందరి పర్సనల్ జీవితాల గురించి మాట్లాడే వేణు స్వామి, అతని భార్య శ్రీవాణిని ఎందుకు ఆమె తల్లి దగ్గరకు పంపటం లేదు. బ్లాక్ మనీ ఉన్న వాళ్లకే వేణు స్వామి అపాయింట్‌మెంట్ ఉంటుంది. లారీ అద్దాలు పెట్టుకుని మెల్ల కన్ను కవర్ చేస్తాడు. వాడు చేసే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు (Heroines) మోసపోవద్దు. ఈమధ్య కొంతమంది అమ్మాయిలతో నగ్న పూజలు కూడా చేయించాడని తెలిసింది. ఇలాంటి లఫూట్ గాళ్లపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు (AP and Telangana Governments) చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యాడు.

వైసీపీ‌ని ఉద్దేశిస్తూ (Jabardasth Kiraak RP Challange to YSRCP).. ‘‘వైసీపీ వాళ్లు నన్ను చంపేస్తానని ఫోన్‌లు చేస్తున్నారు. వాళ్లందరికీ ఒక్కటే చెబుతున్నా.. మాటలు వద్దు.. దమ్ముంటే హైదరాబాద్ వచ్చి చంపుకోండి.. ఇదే నా సవాల్’’ అని ఆర్పీ ఛాలెంజ్ విసిరారు. కాగా, జబర్దస్త్‌లో ఫేమస్ కమెడియన్‌గా పేరొందిన కిరాక్ ఆర్పీ.. ఆ తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ పిచ్చ ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఏపీ ఎన్నికలలో కూటమికి సపోర్ట్ చేసి, పలుచోట్ల ప్రచారం నిర్వహించడమే కాకుండా.. వైసీపీ నాయకులకు ధీటుగా సమాధానమిస్తూ వస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 29 , 2024 | 08:34 PM