Indian 2 : సేనాపతితో తలపడేది అతనేనా?

ABN , First Publish Date - 2023-06-06T11:55:05+05:30 IST

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan), తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌2’ (Indian 2). ఇందులో కమల్‌కు ధీటుగా పోరాడే ప్రతినాయకుడు ఎవరా? అని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. సేనాపతి(Senapati)తో తలపడే ప్రతినాయకుడిగా వెర్సటైల్‌ యాక్టర్‌ ఎస్‌ జె సూర్యను (SJ Surya) ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి

Indian 2 : సేనాపతితో తలపడేది అతనేనా?

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan), తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌2’ (Indian 2). 1996లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇండియన్‌’ (Bhaarateeyudu) ఎంత విజయం సాధించిందో తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తోంది. ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవీ తిరుపతి, తైవాన్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకొచ్చారు. ఇప్పటికే 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో కమల్‌కు ధీటుగా పోరాడే ప్రతినాయకుడు ఎవరా? అని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది.

సేనాపతి(Senapati)తో తలపడే ప్రతినాయకుడిగా వెర్సటైల్‌ యాక్టర్‌ ఎస్‌ జె సూర్యను (SJ Surya) ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే వార్త సోషల్‌ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మెయిన్‌ వవిలన్‌ తానే అని అతనిపై సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ శంకర్‌ డిజైన్‌ చేశారని సమాచారం. అంతే కాదు... విలన్‌ ఎవరో బయటికి చెప్పకుండానే షూటింగ్‌ కంప్లీట్‌ చేశారని కూడా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్‌, రకుల్‌ కథానాయికలు. సిద్ధార్థ్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.

Updated Date - 2023-06-06T11:55:05+05:30 IST