Bharateeyudu 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇక లంచగొండులకు మూడినట్టే!

ABN , First Publish Date - 2023-11-03T18:18:07+05:30 IST

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు.. రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. శుక్ర‌వారం ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ను పాన్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి విడుదల చేశారు. ఈ ఇంట్రో గ్లింప్స్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది.

Bharateeyudu 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇక లంచగొండులకు మూడినట్టే!
Bharateeyudu 2 Still

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)తో పాటు.. రెడ్ జెయింట్ (Red Giant) బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’ (Bharateeyudu 2). కమల్, శంకర్ కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భార‌తీయుడు’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భార‌తీయుడు 2’ రూపొందుతోన్న సంగ‌తీ తెలిసిందే. శుక్ర‌వారం ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ను పాన్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి (SS Rajamouli) విడుదల చేశారు.

‘భార‌తీయుడు 2’ ఇంట్రో గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. ‘ భార‌తీయుడు’లో లంచానికి వ్య‌తిరేకంగా పోరాడిన వీర‌శేఖ‌రన్ సేనాప‌తి ఇండియాలో మ‌ళ్లీ త‌ప్పు జ‌రిగితే తాను తిరిగి వ‌స్తాన‌ని చెప్ప‌టంతో క‌థ ముగిసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ దేశంలో లంచ‌గొండిత‌నం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవ‌రూ ఏ ప‌నులు చేయ‌టం లేదు. దీంతో సామాన్యుడు బ‌త‌క‌ట‌మే క‌ష్టంగా మారింది. అప్పుడు భార‌తీయులంద‌రూ క‌మ్ బ్యాక్ ఇండియ‌న్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మ‌ళ్లీ దేశంలోకి భార‌తీయుడు అడుగు పెట్టాల‌ని రిక్వెస్టులు పంపుతారు. చివ‌ర‌కు వీర‌శేఖ‌ర‌న్ సేనాప‌తి ఇండియాలోకి అడుగు పెడ‌తారు. వ‌చ్చిన త‌ర్వాత సేనాప‌తి ఏం చేశారు.. భార‌తీయుడుకి భ‌య‌ప‌డి లంచాలు మానేసిన అధికార‌లు మ‌ళ్లీ లంచాలు తీసుకోవ‌టానికి కార‌ణం ఎవ‌రు? పేట్రేగిన లంచం వ‌ల్ల దేశంలో ఎలాంటి అల్ల‌క‌ల్లోలాలు జ‌రిగాయి. అనే విష‌యాల‌ను ఈ గ్లింప్స్‌లో చాలా గ్రాండియ‌ర్‌గా చూపించారు డైరెక్ట‌ర్ శంక‌ర్‌. గ్లింప్స్‌లోనే ఈ రేంజ్ గ్రాండియ‌ర్‌నెస్ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వసరం లేదు. (Bharateeyudu 2 Teaser Talk)


Kamal.jpg

ఇదే గ్లింప్స్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు హీరో సిద్ధార్థ్‌, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంక‌ర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహా త‌దిత‌రుల‌ లుక్స్‌ను కూడా పరిచయం చేశారు. సినిమా మేకింగ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిన డైరెక్ట‌ర్ శంక‌ర్, ఈసారి ‘భార‌తీయుడు 2’ చిత్రంతో ఎలాంటి సెన్సేష‌న్స్‌కు తెర తీయ‌బోతున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. ఈ ఇంట్రో గ్లింప్స్‌ను త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌, హిందీలో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్‌, మ‌ల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్‌ మోహ‌న్ లాల్‌, క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్ విడుద‌ల చేశారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Junior Balaiah: జూనియర్‌ బాలయ్య ఇకలేరు

*************************************

*Dayaa: జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడిగా అవార్డ్

**************************************

Updated Date - 2023-11-03T18:22:18+05:30 IST