సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayashanthi: నా దూకుడు, పోరాటం వెనుక ఉండేది ఎప్పుడూ వారే..

ABN, First Publish Date - 2023-07-06T22:14:42+05:30

‘ది యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అంటూ విజయశాంతి యాక్షన్ సీన్స్‌తో నిండిన ఓ వీడియోను.. పవర్ ఫుల్ తమిళ సాంగ్‌తో ఆమె అభిమానులు విడుదల చేశారు. ఈ వీడియోని చూసిన విజయశాంతి మరోసారి తన ‘కర్తవ్యం’ సినిమా రోజులని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Vijayashanthi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanthi) తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసి.. ఆ వీడియోని క్రియేట్ చేసిన వారి గురించి రాసుకొచ్చింది. ఈ వీడియో విజయశాంతి పాలిటిక్స్‌కు సంబంధించినది కాదు. కానీ నా తెంపరితనం, దూకుడు, పోరాటం వారే అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు నెటిజన్లు కూడా ‘మాస్ తలైవి’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

‘ది యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ (The Action Queen of Indian Cinema) అంటూ విజయశాంతి యాక్షన్ సీన్స్‌తో నిండిన ఓ వీడియోను.. పవర్ ఫుల్ తమిళ సాంగ్‌తో ఆమె అభిమానులు విడుదల చేశారు. ఈ వీడియోని చూసిన విజయశాంతి మరోసారి తన ‘కర్తవ్యం’ (Karthavyam Movie) సినిమా రోజులని గుర్తు చేసుకున్నారు. ఆ వీడియోని పోస్ట్ చేసిన విజయశాంతి..

‘‘నా తెంపరితనం, దూకుడు, పోరాటం ఎప్పుడు అభిమానులే... మీ వీడియో దృష్ట్యా ఇది, కళాకారిణిగా నాకు మీరు ప్రసాదించిన జన్మ బంధం, వరం ఎప్పటికి.. మీరు అభిమానంతో ఇచ్చే ఈ గౌరవాన్ని కాపాడుకోవడంలో.. అదే మీ ఆవేశం, సినిమా అయినా.. ప్రజా జీవనమైనా నాకు ఎన్నటికి స్ఫూర్తిపూర్వకం... మీ రాములమ్మ (Ramulamma)’’ అంటూ పోస్ట్ చేశారు.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. ‘‘మీ అభిమానులుగా మేము మీతోనే ఉంటాము, అభిమానులపై మీరు చూపించే ప్రేమ అజరామరం. మీరే మాకు స్ఫూర్తి, మీరు చూపించిన నీతి, నిజాయితీ, పట్టుదల, కృషి బాటలోనే విజయశాంతిగారి అభిమానులుగానే మా జీవనం ఎన్నటికీ..’, ‘మాస్ తలైవి’ (Mass Thalaivi), ‘మాస్ లేడీ సూపర్‌స్టార్’ అంటూ విజయశాంతిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Jagapathi Babu: అప్పుడు ‘లెజెండ్’.. ఇప్పుడు ‘రుద్రంగి’.. వైల్డ్ క్యారెక్టర్‌తో వస్తున్నా..

**************************************

*Mrunal Thakur: ఫస్ట్ క్రష్, డిప్రెషన్.. మృణాల్‌ ఠాకూర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*Thangalaan: విక్రమ్ ‘తంగలాన్‌’ ఎంత వరకు వచ్చిందంటే..

**************************************

*Lavanya Tripathi: పెళ్లి కళ వచ్చేసింది.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూశారా!

**************************************

*Nikhil: ఇక ఆ తప్పు జరగనివ్వను.. సారీ చెప్పిన హీరో నిఖిల్

**************************************

*Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం

**************************************

Updated Date - 2023-07-06T22:14:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!