Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్

ABN , First Publish Date - 2023-04-04T12:17:33+05:30 IST

ఇరు కుటుంబాలకు చెందిన పెద్దవారు ఎవరూ లేకుండానే ఉపాసన తన బేబీ షవర్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. అదేంటని అనుకుంటున్నారా?

Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్
Upasana Baby Shower Party at Dubai

రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజు వేడుకలను పూర్తి చేసుకున్న మెగా ఫ్యామిలీ (Mega Family) ఇంట.. ఇప్పుడు అసలు సిసలైన సంబరాలు మొదలు కాబోతున్నాయి. మెగా ఫ్యామిలీ, అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న సమయం దగ్గరకు వచ్చేస్తోంది. ఎప్పుడెప్పుడు మెగా చిట్టి బాస్‌ని చూడాలా? అని మెగా అభిమానులు (Mega Fans) ఎంతో ఆతురతగా వేచి చూస్తున్నారు. ఆ సమయానికి సమయం ఆసన్నమైనట్లుగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్‌ని చూస్తుంటే తెలుస్తోంది. ఉపాసన సీమంతానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఇరు కుటుంబాలకు చెందిన పెద్దవారు ఎవరూ లేకుండానే ఉపాసన తన బేబీ షవర్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. అదేంటని అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే.. (Upasana Baby Shower Celebrations)

Upsi-1.jpg

రీసెంట్‌గా రామ్ చరణ్, ఉపాసన కలిసి దుబాయ్ వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఎయిర్ పోర్ట్‌లో దర్శనమివ్వడంతో ఈ వెకేషన్‌కి సంబంధించిన వార్త బయటికి వచ్చింది. వారితో పాటు.. ఉపాసన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన దాదాపు 60 మంది దుబాయ్ వెళ్లినట్లుగా తెలుస్తుంది. వారంతా ఉపాసన బేబీ షవర్ పార్టీని సెలబ్రేట్ చేసి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Upsi-2.jpg

ఉపాసన వైట్ డ్రెస్‌లో (White Maxi Dress) ఏంజెల్‌లా మెరిసిపోతున్న ఫొటోలు వైరల్ అవుతుండటంతో.. బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో ఉపాసన బేబీ షవర్ పార్టీ (Upasana Baby Shower Party) అంటూ అంతా రామ్ చరణ్ దంపతులుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుక దుబాయ్‌లోని (Dubai) నమ్మోస్ బీచ్ క్లబ్‌లోని స్వాంకీలో జరిగినట్లు సమాచారం.

Read Also- Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

UPsi-3.jpg

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana Konidela) దుబాయ్ వెకేషన్ ముగించుకుని వచ్చేయగానే.. ఇరు కుటుంబాలు ఉపాసన బేబీ షవర్ పార్టీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు ఇప్పటికే మెగా సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకను ఇరు కుటుంబాలు కలిసి కనీ వినీ ఎరుగని రేంజ్‌లో చేయబోతున్నారనేలా టాక్ నడుస్తోంది. అదే జరిగితే మెగాభిమానుల ఆనందానికి అవధులే ఉండవని చెప్పుకోవాలి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రంలో చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫస్ట్ లుక్‌ను ఇటీవలే ప్రకటించారు. దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే చరణ్.. ఈ సినిమా షూటింగ్‌‌లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం శంకర్ ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Rashmika Mandanna: ‘రెయిన్‌బో’.. రష్మికకు ప్రమోషన్

*Deepika Padukone: దీపిక గురించి ఈ విషయాలు తెలుసా?

*Jr NTR: ఒక్కటి కాదు.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్!

*Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?

Updated Date - 2023-04-04T12:49:02+05:30 IST