Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?

ABN , First Publish Date - 2023-04-01T13:44:45+05:30 IST

అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్-2023(IPL 2023) వేడుకలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరుగగా..

Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?
Rashmika Mandanna at IPL 2023 Launch

అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్-2023(IPL 2023) వేడుకలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరుగగా.. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన వేడుకలో తెలుగు పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannah), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna).. తెలుగు మాస్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ.. వీక్షకులకు వినోదాన్ని పంచారు. ముఖ్యంగా రష్మిక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన, తను నటించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘నా సామి.. రారా సామి’, ‘శ్రీవల్లి’ పాటలకు వేసిన స్టెప్స్ ఓ రేంజ్‌లో వీక్షకులను ఆకర్షించాయి.

రష్మిక తను నటించిన సినిమా పాటలకే కాకుండా.. అలియా భట్ (Alia Bhatt) నటించిన ‘గంగూబాయి కాఠియావాడి’ (Gangubai Kathiawadi) సినిమాలోని డోలీనా పాటకు, ఆస్కార్ వేదికపై ప్రభంజనం సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలోని నాటు నాటు (Naatu Naatu) పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె ఈ పాటకు డ్యాన్స్ చేసేటప్పుడు స్టేడియం అంతా క్లాప్స్, విజిల్స్‌తో హోరెత్తింది. ఈ స్పందనపై తాజాగా రష్మిక మందన్నా (Rashmika Mandanna) సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘‘ఐపీఎల్ ప్రారంభ వేడుకలో నా డ్యాన్స్ ఘట్టం పూర్తయింది. స్టేడియంలో ఆ బ్లాస్టింగ్ స్పందన చూసి ఆశ్చర్యపోయాను. అయితే వారిసు (Varisu) సినిమాలోని ‘జిమిక్కి పొన్ను’ పాటకి కూడా ఆ స్టేజ్‌పై డ్యాన్స్ చేయాలని అనుకున్నాను. కానీ చేయలేకపోయాను. ఈ పాట కావాలని అడుగుతున్న వారందరికీ ఇదిగో నా గిఫ్ట్’’ అంటూ.. ఆ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోని రష్మిక పోస్ట్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియో చూసిన కోలీవుడ్ ప్రేక్షకులు రష్మికపై ప్రశంసలు కురిపిస్తూ థ్యాంక్స్ చెబుతుంటే.. కొందరు మాత్రం అక్కడ చేయకుండా ఇక్కడెందుకులే.. అంటూ పెదవి విరుస్తున్నారు. మొత్తంగా రష్మిక (Rashmika) చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Rashmika.jpg

రష్మిక మందన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె సందీప్ వంగా (Sundeep Vanga) తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘యానిమల్‌’ (Animal)లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప ది రూల్’‌ (Pushpa The Rule)లో కూడా ఆమె పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇవి కాకుండా.. రీసెంట్‌గా ‘భీష్మ’ (Bheeshma) కాంబినేషన్‌లో ఆమె ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. నితిన్ (Nithiin) హీరోగా, వెంకీ కుడుమల (Venky Kudumula) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇవి కాకుండా ఇంకో రెండు, మూడు భారీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

*********************************

*Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు

*Natural Star Nani: ‘దసరా’పై సూపర్ స్టార్ ట్వీట్.. నాని అలా అనేశాడేంటి?

*Nita Ambani: అట్టహాసంగా మొదలైన నీతా అంబానీ కలల ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం!

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

*Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

Updated Date - 2023-04-01T13:44:46+05:30 IST