Deepika Padukone: దీపిక గురించి ఈ విషయాలు తెలుసా?

ABN , First Publish Date - 2023-04-02T12:47:31+05:30 IST

దీపిక జీవితం గురించిన ప్రతీ విషయం అభిమానులకు తెలుసు. ఆమె కెరీర్‌లో కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. సరదాగా వాటిపై ఓ లుక్కేస్తే..

Deepika Padukone: దీపిక గురించి ఈ విషయాలు తెలుసా?
Deepika Padukone

టాటూతో ప్రమోట్‌... దీపికా పదుకొణె (Deepika Padukone) దశాబ్దం పాటుగా బాలీవుడ్‌ (Bollywood)లో అగ్రతారగా కొనసాగుతోంది. ఇటీవల ‘ఆస్కార్‌’ (Oscar) వేదికపై కూడా తన సత్తా చాటుకుని, అందరి అభిమానం చూరగొంది. దీపిక జీవితం గురించిన ప్రతీ విషయం అభిమానులకు తెలుసు. ఆమె కెరీర్‌లో కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. సరదాగా వాటిపై ఓ లుక్కేస్తే..

Deepika-2.jpg

దీపికని బెంగళూరు (Bengaluru) బ్యూటీగా అభివర్ణిస్తారు ఆమె అభిమానులు. ఎందుకంటే స్టార్‌డమ్‌ సంపాదించింది బాలీవుడ్‌లో అయినా తను పెరిగింది బెంగళూరులోనే. అయితే... దీపిక పుట్టింది మన దేశంలో కాదు. 1986లో డెన్మార్క్‌లో జన్మించింది. 11నెలల వయసున్నప్పుడే దీపిక కుటుంబం బెంగళూరు షిఫ్ట్‌ అయ్యింది. దీపిక పదుకొణె తండ్రి పేరు ప్రకాశ్‌ పదుకొణె. తల్లి పేరు ఉజాలా. సోదరి పేరు... అనీషా. ప్రకాశ్‌, ఉజాలా, అనీషా, దీపిక... వీటన్నింటి అర్థం ఒక్కటే.. ‘వెలుగు’ (Velugu). దీపిక కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. (Deepika Padukone Family Members)

Deepika-4.jpg

దీపిక బాలీవుడ్‌ ఎంట్రీ ‘ఓం శాంతి ఓం’ (Om Shanti Om) సినిమాతో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆమె ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ఇప్పుడు దీపిక పారితోషికం ఒక్కో సినిమాకీ రూ.12 కోట్ల పైమాటే. దీపిక తొలి తెలుగు చిత్రం అని అడగ్గానే అందరూ ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) అని చెప్పేస్తారు. కానీ.. ఈ సినిమా కంటే ముందే దీపిక ‘లవ్‌ ఫర్‌ ఎవర్‌’ (Love Forever) అనే చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అయితే ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. లేదంటే తన తొలి తెలుగు చిత్రం అదే అయ్యేది.

Deepika-1.jpg

దక్షిణాది వంటకాలంటే దీపికకు చాలా ఇష్టం. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో చారు వేసుకొని తినడం మరీ ఇష్టం. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండే దీపిక స్వీట్స్‌ మాత్రం బాగా లాగిస్తుంది.

Deepika-5.jpg

ఈ యేడాది ఆస్కార్‌ ప్రజెంటర్‌గా ఆమె అరుదైన అవకాశాన్ని అందుకొంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోని నాటు నాటు (RRR Naatu Naatu Song) పాటని డాల్బీ ఆడిటోరియానికి పరిచయం చేసింది తనే. ఈ వేడుకలో దీపిక దుస్తులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Deepika-6.jpg

ఆమె మెడపై టాటూ గురించైతే సోషల్‌ మీడియాలో బాగా చర్చ సాగింది. మెడపై ‘82 డిగ్రీస్‌ ఈ’ అనే పచ్చబొట్టు (Deepika Padukone Tattoo) వేయించుకొంది. అది ఆమె కొత్తగా ప్రమోట్‌ చేస్తున్న బ్రాండ్‌ పేరు కావడం విశేషం.

Deepika-3.jpg

2013.. దీపిక కెరీర్‌లో మర్చిపోలేని యేడాది. ‘రేస్‌’, ‘ఏ జవానీ హై దివానీ’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘రామ్‌లీల’ ఈ సంవత్సరంలోనే విడుదలై సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ నాలుగు చిత్రాలూ వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాయి. దాంతో దీపికకు స్టార్‌డమ్‌ వచ్చేసింది. బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ కథానాయిక (No 1 Heroine)గా ఎదిగింది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Costumes Krishna: దిల్ రాజుకు లిఫ్ట్ ఇచ్చిన నిర్మాత, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

*Jr NTR: ఒక్కటి కాదు.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్!

*Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?

*Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు

*Natural Star Nani: ‘దసరా’పై సూపర్ స్టార్ ట్వీట్.. నాని అలా అనేశాడేంటి?

*Nita Ambani: అట్టహాసంగా మొదలైన నీతా అంబానీ కలల ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం!

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

Updated Date - 2023-04-02T12:47:32+05:30 IST