Rashmika Mandanna: ‘రెయిన్‌బో’.. రష్మికకు ప్రమోషన్

ABN , First Publish Date - 2023-04-04T10:13:27+05:30 IST

స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న రష్మిక మందన్నకు ప్రమోషన్ వచ్చేసింది. ఇప్పుడామె ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Rashmika Mandanna: ‘రెయిన్‌బో’.. రష్మికకు ప్రమోషన్
Rashmika Mandanna

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరొందిన రష్మిక మందన్నా (Rashmika Mandanna).. ప్రస్తుతం బాలీవుడ్‌ (Bollywood)లోనూ తన ప్రతాపం చూపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఆమె నటించిన రెండు మూడు సినిమాలు విడుదలైనప్పటికీ.. అనుకున్నంతగా విజయం మాత్రం సాధించలేదు. అయినా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సౌత్, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూనే.. ఇప్పుడు రష్మిక ఇంకో మెట్టు ఎక్కేసింది. రష్మిక ప్రధాన పాత్రలో ఇప్పుడొక చిత్రం తెరకెక్కబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించే సినిమాకు సంబంధించిన వివరాలను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాలలోకి వెళితే..

Rainbow-2.jpg

నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభులు సంయుక్తంగా తమ సొంత నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) బ్యానరుపై ‘రెయిన్‌బో’ (Rainbow) అనే పేరుతో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించే ఈ చిత్రాన్ని రొమాంటిక్‌ ఫాంటసీ లవ్‌ స్టోరీగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. శాంతరూబన్‌ (Santha Ruban) డైరెక్టరుగా పరిచమవుతున్న ఈ మూవీలో దేవ్‌ మోహన్‌ (Dev Mohan) ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కెమెరా కేఎం భాస్కరన్‌, జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా..

Rashmika-Mandanna.jpg

నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు (SR Prabhu) మాట్లాడుతూ.. అన్ని వయస్సు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ మూవీ ఉంటుంది. మా బ్యానరులో వచ్చే ప్రతి ఒక్క చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. డెబ్యూ డైరెక్టర్‌ శాంతరూబన్‌ మాట్లాడుతూ.. భారత చలనచిత్ర పరిశ్రమలో (Indian Cinema) ఇప్పటివరకు చూడని ఒక రొమాంటిక్‌ ఫాంటసీ లవ్‌ మూవీగా ఉంటుంది. రష్మికలోని మరో కోణాన్ని తెరపై చూస్తారు. వినూత్నమైన కథాంశంతో తెరకెక్కించే ఈ మూవీ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు. (Rashmika Mandanna Lady Oriented Film Details)

ఇవి కూడా చదవండి:

*********************************

*Deepika Padukone: దీపిక గురించి ఈ విషయాలు తెలుసా?

*Jr NTR: ఒక్కటి కాదు.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్!

*Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?

Updated Date - 2023-04-04T10:15:51+05:30 IST