Jr NTR: ఒక్కటి కాదు.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్!

ABN , First Publish Date - 2023-04-01T14:54:54+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేశారో తెలియంది కాదు. కొరటాల శివతో చేయాలనుకున్న ‘NTR30’ సినిమాపై సరైన అప్‌డేట్ కూడా రాకపోవడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు

Jr NTR: ఒక్కటి కాదు.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్!
Young Tiger NTR

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేశారో తెలియంది కాదు. కొరటాల శివతో చేయాలనుకున్న ‘NTR30’ సినిమాపై సరైన అప్‌డేట్ కూడా రాకపోవడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అలా నిరాశలో ఉన్న వారందరినీ.. ఊపిరి పీల్చుకోలేనంతగా NTR30 అప్‌డేట్స్ వదిలి ఆ చిత్ర మేకర్స్ ఖుష్ చేశారు. మరీ ముఖ్యంగా ఆలియా భట్ అనుకున్న ప్లేస్‌లోకి జాన్వీ కపూర్ వచ్చి చేరడంతో.. ఫ్యాన్స్ అంతా పిచ్చ హ్యాపీగా ఉన్నారు. హీరోయిన్ అనౌన్స్‌మెంట్స్, పూజా కార్యక్రమాలు, సాంకేతిక నిపుణుల వివరాలతో ‘NTR30’ ఏదో ఒక రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇలా NTR30 అప్‌డేట్స్‌తో యమా హ్యాపీగా ఉన్న ఫ్యాన్స్‌కి ఇప్పుడు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. అదేంటంటే..

ఈ మధ్య రీ రిలీజ్‌ల ట్రెండ్ ఏ రేంజ్‌లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తెరలేపిన ఈ ట్రెండ్.. ఇప్పుడు మాములుగా విడుదలైన సినిమాల కంటే కూడా భారీ స్పందనను రాబట్టుకుంటోంది. ‘జల్సా’, ‘ఖుషి’. ‘నరసింహనాయుడు’, ‘బిల్లా’, ‘రెబల్’, ‘ఒక్కడు’, ‘ఆరెంజ్’ ఇలా స్టార్ హీరోల సినిమాల నుంచి మీడియం రేంజ్ సినిమాల వరకు గతంలో హిట్టయిన, ఫ్లాప్ అయిన సినిమాలన్నింటినీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు.

NTR-aadi.jpg

రీసెంట్‌గా రామ్ చరణ్ బర్త్‌డేను పురస్కరించుకుని ‘ఆరెంజ్’ సినిమాను రీ రిలీజ్ చేయగా.. రికార్డ్ స్థాయిలో ఆ సినిమా కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇప్పుడిక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. తన బర్త్‌డేకి ఎన్టీఆర్ ఒకటి కాదు.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. రీసెంట్‌గా సమయం, సందర్భం లేకుండా గతంలో ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే.. అది మళ్లీ అటువంటి రిజల్ట్‌నే సొంతం చేసుకుంది. దీంతో ఈసారి ఎన్టీఆర్ బర్త్‌డేకి విడుదల చేయబోయే సినిమాల విషయంలో పక్కా ప్లాన్‌‌ని అమలు చేస్తున్నారు.

Simhadri.jpg

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన, ఇంతకు ముందు బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న రెండు చిత్రాలను 4K వెర్షన్‌లో దించేందుకు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏమిటని అనుకుంటున్నారా? ఎన్టీఆర్‌కి మాస్ ఇమేజ్‌కి కారణమైన ‘ఆది’ చిత్రం ఒకటి కాగా.. రెండోది దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సెన్షేషనల్ బ్లాక్‌బస్టర్ ‘సింహాద్రి’. 4K (అల్ట్రా HD), డాల్బీ అట్మాస్ 5.1తో ‘సింహాద్రి’ (Simhadri Re Release) చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలను ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్‌గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ‘ఆది’ చిత్రాన్ని ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే మే 20న విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే ‘సింహాద్రి’ చిత్రానికి సంబంధించి ఏప్రిల్ 9వ తేదీన అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ రెండు చిత్రాలతో.. ఇప్పటి వరకు ఉన్న రీ రిలీజ్ రికార్డులను భయపెట్టేలా.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా నందమూరి అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:

*********************************

*Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?

*Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు

*Natural Star Nani: ‘దసరా’పై సూపర్ స్టార్ ట్వీట్.. నాని అలా అనేశాడేంటి?

*Nita Ambani: అట్టహాసంగా మొదలైన నీతా అంబానీ కలల ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం!

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

*Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

Updated Date - 2023-04-01T14:54:56+05:30 IST